Venkatesh Iyer T20 XI: ఆల్‌టైమ్ టీ20 జట్టు.. రోహిత్, కోహ్లి దక్కని చోటు!
ABN , Publish Date - Nov 19 , 2025 | 03:45 PM
వెంకటేశ్ అయ్యర్ ఎంచుకున్న టీ20 ఆల్‌టైమ్ జట్టులో భారత బ్యాటింగ్ దిగ్గజాలు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మలకు చోటు దక్కలేదు. ఐపీఎల్‌లో, అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్లో పరుగుల వరద పారించిన రోహిత్, కోహ్లీకు వెంకటేశ్ అయ్యర్ తన జట్టులో స్థానం ఇవ్వకపోవడం గమనార్హం
ఐపీఎల్-2026 వేలానికి ముందు భారత ఆల్‌రౌండర్ వెంకటేశ్ అయ్యర్ (Venkatesh Iyer)కు భారీ షాక్ తగిలింది. గతేడాది కోట్లు కుమ్మరించి అతడిని కొనుక్కున్న కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) ఈసారి మాత్రం ఆక్షన్‌లోకి విడిచిపెట్టేసింది. ఇదిలా ఉంటే.. డిసెంబరు 16న అబుదాబి వేదికగా వేలంపాట జరుగనున్న నేపథ్యంలో క్రిక్‌ట్రాకర్‌కు వెంకటేశ్ ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ సందర్భంగా తన ఆల్‌టైమ్ టీ20 ఎలెవన్‌ను వెంకటేశ్ అయ్యర్(Venkatesh Iyer T20 XI) ప్రకటించాడు.
వెంకటేశ్ అయ్యర్ ఎంచుకున్న టీ20 ఆల్‌టైమ్ జట్టులో భారత బ్యాటింగ్ దిగ్గజాలు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మల(Rohit Sharma excluded)కు చోటు దక్కలేదు. ఐపీఎల్‌లో, అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్లో పరుగుల వరద పారించిన రోహిత్, కోహ్లీకు వెంకటేశ్ అయ్యర్ తన జట్టులో స్థానం ఇవ్వకపోవడం గమనార్హం. ఇక తన జట్టులో ఓపెనర్లుగా భారత విధ్వంసకర బ్యాటర్లు వీరేందర్ సెహ్వాగ్, అభిషేక్ శర్మను ఎంచుకున్న వెంకటేశ్.. సౌతాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్(AB de Villiers)ను వన్‌డౌన్‌లో ఆడిస్తానని తెలిపాడు. మిస్టర్ ఐపీఎల్‌గా పేరొందిన టీమిండియా మాజీ బ్యాటర్ సురేశ్ రైనాను తన జట్టులోకి ఎంపిక చేశాడు. అలానే ఇద్దరు పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్లుకు చోటిచ్చాడు.
ఇంగ్లండ్ స్టార్ బెన్ స్టోక్స్‌తో పాటు టీమిండియా మేటి ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాకు వెంకటేశ్ తన జట్టులో స్థానం కల్పించాడు. ఇక ఏడో స్థానానికి, వికెట్ కీపర్ బ్యాటర్‌గా.. కెప్టెన్‌గా టీమిండియా మాజీ కెప్టె్న్ ఎంఎస్ సింగ్ ధో( MS Dhoni captain)నిని వెంకటేశ్ అయ్యర్ ఎంచుకున్నాడు. ఇక బౌలింగ్ విభాగంలో భారత మేటి బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah), శ్రీలంక దిగ్గజం లసిత్ మలింగ, అఫ్గానిస్తాన్ స్టార్ రషీద్ ఖాన్, వెస్టిండీస్ దిగ్గజం సునిల్ నరైన్‌లకు చోటు ఇచ్చాడు. ఇక ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ మాథ్యూ హెడెన్‌కు అయ్యర్ స్థానమిచ్చాడు.
ఇవి కూడా చదవండి:
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి