Gangster Anmol Bishnoi: అన్మోల్ బిష్ణోయ్‌ను డిపోర్ట్ చేసిన యూఎస్.. అరెస్టు చేసిన ఎన్ఐఏ
ABN , Publish Date - Nov 19 , 2025 | 03:20 PM
యూఎస్ నుంచి డిపోర్ట్ కాగానే అన్మోల్‌ను అదుపులోకి తీసుకున్నట్టు ఎన్ఐఏ తెలిపింది. 2022 నుంచి పరారీలో ఉన్న అన్మోల్‌కు ప్రస్తుతం జైలులో ఉన్న అతని సోదరుడు లారెన్స్ బిష్ణోయ్ నేతృత్వంలోని టెర్రర్ సిండికేట్‌తో ప్రమేయముంది.
న్యూఢిల్లీ: ఎన్‌సీపీ నేత బాబా సిద్ధిఖీ హత్యతో సహా 31 కేసుల్లో నిందితుడిగా ఉన్న గ్యాంగ్‌స్టర్ అన్మోల్ బిష్ణోయ్ (Gangster Anmol Bishnoi)ను అమెరికా డిపోర్ట్ చేయడంతో అక్కడి నుంచి భారత్‌కు తరలించారు. అన్మోల్‌ను తీసుకువచ్చిన విమానం ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో బుధవారం మధ్యాహ్నం ల్యాండ్ కావడంతో వెంటనే అతన్ని ఎన్ఐఏ (NIA) అదుపులోకి తీసుకుంది. ముందస్తుగా ఐజీఐ టెర్మినల్ 3 వద్ద పోలీసు సిబ్బంది డాగ్ స్క్వాడ్‌లతో వాహనాలు, పరిసర ప్రాంతాల్లో తనిఖీలు చేశారు. అన్మోల్‌ను పాటియాలా హౌస్ కోర్టు ముందు ఎన్ఐఏ హాజరుపరచనుంది.
యూఎస్ నుంచి డిపోర్ట్ కాగానే అన్మోల్‌ను అదుపులోకి తీసుకున్నట్టు ఎన్ఐఏ తెలిపింది. 2022 నుంచి పరారీలో ఉన్న అన్మోల్‌కు ప్రస్తుతం జైలులో ఉన్న అతని సోదరుడు లారెన్స్ బిష్ణోయ్ నేతృత్వంలోని టెర్రర్ సిండికేట్‌తో ప్రమేయముంది. ముంబైలో సంచలనం సృష్టించిన బాబా సిద్ధిఖీ హత్య కేసు నిందితులతో అన్మోల్ సంప్రదింపుల సాగించినట్టు ఎన్ఐఏ గుర్తించింది. 2022లో పంజాబీ గాయకుడు సిద్ధూమూసేవాలా హత్య కేసులోనూ అతను అభియోగాలను ఎదుర్కొంటున్నాడు. 2024 ఏప్రిల్‌లో సల్మాన్‌ఖాన్ ఇంటిపై కాల్పుల కేసులో కూడా వాంటెడ్‌గా ఉన్నాడు. వివిధ రాష్ట్రాల్లో ఆయనపై 31 కేసులు నమోదైనట్టు చెబుతున్నారు. ఆయనపై రూ.10 లక్షల రివార్డును కూడా ఎన్ఐఏ ప్రకటించింది.
కాగా, గత ఏడాది అమెరికాలో డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ అధికారులకు అన్మోల్ చిక్కాడు. అప్పట్నించి ఆయనను అప్పగించాల్సిందిగా ఎన్ఐఏ సంప్రదింపులు సాగిస్తూ వచ్చింది. ఈనెల 18న అన్మోల్‌ను అమెరికా బహిష్కరించడంతో ఆయనను న్యూఢిల్లీకి తరలించారు.
ఇవి కూడా చదవండి..
జేడీయూ శాసనసభా పక్ష నేతగా నితీశ్ ఎన్నిక
Red Fort blast: ఎర్రకోట బ్లాస్ట్‌లో షాకింగ్ అప్‌డేట్.. పార్కింగ్ లాట్‌లోనే బాంబు తయారు చేసి..
మరిన్ని జాతీయ వార్తలు కోసం క్లిక్ చేయండి..