Home » New Delhi
ప్రస్తుత యుద్ధ సమయంలో 'గల్ఫ్ దేశాల' సాయం మరువలేనిదని ప్రధాని మోదీ అన్నారు. ఈ కష్టకాలంలో భారత ప్రయోజనాలకు, ముఖ్యంగా చమురు సరఫరా, భారతీయుల భద్రతకు సహకరిస్తున్న గల్ఫ్ దేశాలకు మోదీ ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పారు.
పశ్చిమాసియాలో ఘర్షణలు, హోర్ముజ్ జలసంధి మూసివేత భయాల కారణంగా అంతర్జాతీయ సంక్షోభం తలెత్తడంతో రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు.
ఢిల్లీలో తాజాగా దారుణం వెలుగు చూసింది. ఒక వ్యక్తి తనని తాను తుపాకీతో కాల్చుకుని మరణించాడు. అతడి స్నేహితుడి కళ్లముందే కుప్పకూలిపోయాడు.
విమాన ప్రయాణికులకు దిగ్భ్రాంతి కలిగించే ఘటన సోమవారంనాడు చోటుచేసుకుంది. ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి మాంచెస్టర్‌కు బయలుదేరిన ఇండిగో ఫ్లయిట్ 6E33 బోయింగ్ 787-9 డ్రీమ్‌లైనర్ అనూహ్యంగా గాలిలో ఉండగానే 'యూటర్న్' తీసుకుని వెనక్కి తిరిగొచ్చింది.
పశ్చిమాసియాలో ప్రస్తుత పరిస్థితిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) ఆందోళన వ్యక్తం చేశారు. దౌత్యం, చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలన్నదే ఇండియా నిశ్చితాభిప్రాయమని అన్నారు.
న్యాయవ్యవస్థలో అవినీతి పేరిట ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకంలో పాఠ్యాంశాన్ని చేర్చడంపై సుప్రీం కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పుస్తకంపై నిషేధాన్ని విధించింది. ఎన్‌సీఈఆర్‌టీ చైర్మన్, కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.
పైలట్ అప్రమత్తతో దాదాపు 150 మంది ప్రయాణికుల ప్రాణాలు నిలిచాయి. న్యూఢిల్లీ నుంచి లేహ్ బయలుదేరిన విమానం ఇంజన్‌లో సాంకేతిక లోపం తలెత్తింది. ఈ విషయాన్ని పైలట్ గుర్తించారు.
ఢిల్లీలోని భారత్ మండపంలో జరిగిన ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్‌లో చొక్కాలు విప్పి నిరసన తెలిపిన యూత్ కాంగ్రెస్ కార్యకర్తల అరెస్టుల పర్వం కొనసాగుతోంది. ఈ కేసుకు సంబంధించి యూత్ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు ఉదయ్ భాను చిబ్‌ను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు.
ఢిల్లీ పోలీసులు తాజాగా భారీ ఉగ్రకుట్రను భగ్నం చేశారు. తమిళనాడులో ఆరుగురిని, పశ్చిమబెంగాల్‌లో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో కొందరు బంగ్లాదేశీయులని తెలిపారు.
ఢిల్లీ ఎర్రకోట సమీపంలో దాడులకు పాక్ ప్రేరేపిత ఉగ్ర సంస్థ లష్కరే తోయిబా సిద్ధమైనట్టు నిఘావర్గాలు గుర్తించాయి. ఇస్లామాబాద్ దాడికి ప్రతీకారంగా ఎల్‌ఈటీ ఈ దాడులకు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది.