TVK Vijay: టీవీకే సభ్యులకు క్యూ ఆర్ కోడ్‌తో గుర్తింపు కార్డులు
ABN , Publish Date - Nov 19 , 2025 | 01:26 PM
తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీకి చెందిన కార్యకర్తలకు క్యూ ఆర్ కోడ్‌తో ఉన్న గుర్తింపు కార్టులను అందజేయాలని ఆ పార్టీ నాయత్వం నిర్ణయించింది. ఈమేరకు 1,02,103 మందికి క్యూ ఆర్ కోడ్‌తో కూడిన గుర్తింపు కార్డులను జిల్లా నేతలకు అందజేశారు.
చెన్నై: తమిళగ వెట్రి కళగం (టీవీకే) సభ్యులకు క్యూ ఆర్ కోడ్‌తో కూడిన గుర్తింపు కార్డులు అందజేశారు. ఈ విషయమై ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి బుస్సీ ఆనంద్ తన ఎక్స్ పేజీలో... రాష్ట్ర రాజకీయ పార్టీ చరిత్రలో తొలిసారిగా తమ పార్టీ నాయకులకు క్యూ ఆర్ కోడ్‌తో కూడిన గుర్తింపు కార్డులు అందజేశామన్నారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా పలువిడతగా సుమారు 3 లక్షల మంది నిర్వాహకులను ఎంపిక చేశామన్నారు.

వారిలో తొలివిడతగా ప్రస్తుతం 106 జిల్లాలకు చెందిన 214 శాసనసభ నియోజకవర్గాల పరిధిలో 1,02,103 మందికి క్యూ ఆర్ కోడ్‌తో కూడిన గుర్తింపు కార్డులను పార్టీ అధ్యక్షుడు విజయ్(Vijay) సూచన మేరకు ఆయా జిల్లాల కార్యదర్శులకు అప్పగించినట్లు బుస్పీ ఆనంద్ తెలిపారు.

ఈ వార్తలు కూడా చదవండి..
మరింత తగ్గిన బంగారం ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..
సినిమాలకు.. ఇక సెలవు! నటనకు వీడ్కోలు.. పలికిన నటి తులసి
Read Latest Telangana News and National News