Rohit Sharma: కేకేఆర్‌లోకి రోహిత్ శర్మ!
ABN , Publish Date - Oct 30 , 2025 | 07:48 PM
ఐపీఎల్ 2026 సమీపిస్తోంది. ప్రస్తుతం అందరిలో ఒకటే ప్రశ్న.. రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్‌ను వీడి కేకేఆర్‌లో చేరనున్నాడా?. అయితే ఐపీఎల్ 2026కి ముందు కేకేఆర్ చేసిన ఓ సోషల్ మీడియా పోస్ట్ ఈ వార్తలకు మరింత బలం చేకూర్చింది.
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2026(IPL 2026) సమీపిస్తోంది. ప్రస్తుతం అందరిలో ఒకటే ప్రశ్న.. రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్(Mumbai Indians)ను వీడి కేకేఆర్(KKR)లో చేరనున్నాడా?. అయితే ఐపీఎల్ 2026కి ముందు కేకేఆర్ చేసిన ఓ సోషల్ మీడియా పోస్ట్ ఈ వార్తలకు మరింత బలం చేకూర్చింది. రోహిత్(Rohit Sharma) అత్యంత సన్నిహితుడు.. తాజాగా కేకేఆర్ హెడ్ కోచ్‌గా నియమితుడైన అభిషేక్ నాయర్(Abhishek Nayar) మార్గదర్శకత్వంలో రోహిత్ కేకేఆర్‌లో ఆడే అవకాశాలు లేకపోలేదని అభిమానులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
ఈ వార్తలన్నీ జోరుగా ప్రచారం అవుతున్న నేపథ్యంలో.. ముంబై ఇండియన్స్ కూడా సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. ‘సూర్యుడు మళ్లీ రేపు ఉదయిస్తాడు. కానీ రాత్రిపూట ఉదయించడం అసాధ్యం!’ అని పేర్కొంది. ఈ పోస్ట్ బట్టి రోహిత్ శర్మ ముంబైని వదిలి వెళ్లడం అసాధ్యం అని అభిమానులు అనుకుంటున్నారు. మరోవైపు రోహిత్ శర్మ, అభిషేక్ నాయర్ స్నేహం కూడా ఈ చర్చకు మరింత ఊతమిచ్చింది. అభిషేక్ రోహిత్‌కు ఫిట్‌నెస్ ట్రైనింగ్‌లో గైడ్ చేశాడు. నాయర్ సూచనలతో జిమ్‌లో కసరత్తులు చేసి హిట్‌మ్యాన్ ఏకంగా పది కిలోల బరువు తగ్గి అద్భుత ఫామ్‌ను తిరిగి సాధించారు. ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌లో ఓ సెంచరీ, హాఫ్ సెంచరీ సాధించి అదరగొట్టాడు. ఈ ఫామ్‌తో రోహిత్ తొలిసారిగా ఐసీసీ వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో నిలిచాడు.
వన్డే నంబర్ 1 బ్యాటర్..
ఈ నేపథ్యంలో కేకేఆర్ తన ఎక్స్ ఖాతాలో రోహిత్ శర్మకు శుభాకాంక్షలు తెలియజేసింది. ‘మీరు ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉన్నారు.. దీనికి మీరు అర్హులు, అభినందనలు రోహిత్’ అంటూ పేర్కొంది. అయితే ఒక అభిమాని ఆ పోస్ట్‌కి ‘అయితే కన్ఫామ్ అనుకోవచ్చా..?’ అని కామెంట్ చేయగా కేకేఆర్ స్పందించింది. ‘నంబర్ 1 వన్డే బ్యాటర్ కన్ఫామ్’ అంటూ సమాధానం ఇచ్చింది. ఆ వ్యక్తి వెంటనే ‘అంటే హిట్‌మ్యాన్ కేకేఆర్‌లో చేరినట్టే..’ అని రిప్లై ఇవ్వడంతో ఈ సంభాషణ క్షణాల్లోనే వైరల్ అయింది. అయితే ఇప్పటివరకు రోహిత్ శర్మ ఈ అంశంపై అధికారికంగా స్పందించలేదు. కానీ ఐపీఎల్ 2026 సీజన్‌కు ముందే ఆటగాళ్ల రిటెన్షన్, వేలం సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో ఈ ఊహాగానాలు మరింత వేడెక్కుతున్నాయి. రోహిత్ నిజంగా పర్పుల్ జెర్సీలో కనిపిస్తారా..? లేక మళ్లీ బ్లూ జెర్సీలోనే మెరుస్తాడా..? అనేది ఆసక్తికరంగా మారింది.
ఈ వార్తలు కూడా చదవండి..
Gold Price Today: ఇవాళ్టి మార్కెట్లో బంగారం ధరలు
Australian cricketer: విషాదం.. ఆసీస్ యువ క్రికెటర్ మృతి