Rohit Sharma: హిట్ మ్యాన్ సరికొత్త ప్రయాణం!
ABN , Publish Date - Nov 25 , 2025 | 09:05 PM
టీమిండియా స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ టీ20 ఫార్మాట్ క్రికెట్‌లో సరికొత్త ప్రయాణం ప్రారంభించాడు. టీ20 ప్రపంచ కప్ 2026కి అతడిని బ్రాండ్ అంబాసిడర్‌గా నియమిస్తూ ఐసీసీ నిర్ణయించింది.
ఇంటర్నెట్ డెస్క్: హిట్ మ్యాన్ రోహిత్ శర్మ సరికొత్త ప్రయాణం మొదలుపెట్టాడు. టీ20 ప్రపంచ కప్ 2026(T20 WC 2026)కు రోహిత్ శర్మను బ్రాండ్ అంబాసిడర్‌గా నియమిస్తూ ఐసీసీ నిర్ణయం తీసుకుంది. ఈ టోర్నీకి సంబంధించిన షెడ్యూల్‌ను ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా 2024 ప్రపంచ కప్ తర్వాత రోహిత్ శర్మ టీ20 ఫార్మాట్‌కు వీడ్కోలు చెప్పాడు.
అంతర్జాతీయ క్రికెట్ ఆడుతూనే ఈ టోర్నీకి బ్రాండ్ అంబాసిడర్‌గా మారిన తొలి వ్యక్తిగా రోహిత్ శర్మ(Rohit Sharma) చరిత్ర సృష్టించాడు. కాగా హిట్‌మ్యాన్ ఇప్పటికే టెస్టు, టీ20 ఫార్మాట్లకు రిటైర్‌మెంట్ ఇచ్చిన విషయం తెలిసిందే. కాగా వన్డే ఫార్మాట్‌లో మాత్రం కొనసాగుతున్నాడు. ఈ ఫార్మాట్‌లో రోహిత్ 44 ఇన్నింగ్స్ ఆడి 1220 పరుగులు చేశాడు. అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్ల జాబితాలో రోహిత్‌ది రెండో స్థానం. దీంట్లో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ(Virat Kohli) అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. హిట్‌మ్యాన్ కెప్టెన్సీలో టీమిండియా 2024 టీ20 ప్రపంచ కప్‌ను ముద్దాడింది.
అరుదైన గౌరవం..
బ్రాండ్ అంబాసిడర్ అవ్వడంపై రోహిత్ స్పందించాడు. ‘ఇది నాకు దక్కిన అరుదైన గౌరవం. క్రికెట్ ఆడుతున్నప్పుడు ఎవ్వరినీ అంబాసిడర్‌గా నియమించలేదు. ఐసీసీ ట్రోఫీని గెలవడం చాలా పెద్ద సవాలుతో కూడిన పని. నా 18 ఏళ్ల సుదీర్ఘ క్రికెట్ ప్రయాణంలో రెండు సార్లు మాత్రం ఐసీసీ ట్రోఫీని గెలుచుకున్నాను’ అని రోహిత్ వెల్లడించాడు.
ఇవి కూడా చదవండి:
ప్రాక్టీస్ మొదలుపెట్టిన శ్రేయస్!