Share News

Shreyas Iyer: ప్రాక్టీస్ మొదలుపెట్టిన శ్రేయస్!

ABN , Publish Date - Nov 25 , 2025 | 06:44 PM

గత నెలలో ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో టీమిండియా స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ గాయపడిన విషయం తెలిసిందే. ప్లీహానికి తీవ్ర గాయం కావడంతో ఆటకు దూరమయ్యాడు. తాజాగా అయ్యర్ సాధన మొదలు పెట్టాడు.

Shreyas Iyer: ప్రాక్టీస్ మొదలుపెట్టిన శ్రేయస్!
Shreyas Iyer

ఇంటర్నెట్ డెస్క్: టీమిండియాకు గుడ్ న్యూస్.. గాయం బారిన పడిన స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ మైదానంలోకి అడుగుపెట్టనున్నాడు. జిమ్‌లో నెమ్మదిగా కసరత్తులు చేయడం ప్రారంభించాడు. ఎక్సర్‌సైజ్ బైక్‌సౌ వ్యాయామం చేస్తున్న ఫొటోను అయ్యర్ తన ఇన్‌స్టా స్టోరీలో పోస్ట్ చేశాడు. దీంతో త్వరలోనే శ్రేయస్(Shreyas Iyer) మైదానంలోకి అడుగుపెడతాడని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.


గత నెలలో ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో క్యాచ్ అందుకునే క్రమంలో శ్రేయస్ కడుపు నేలను బలంగా తాకింది. దీంతో అతడి ప్లీహానికి తీవ్ర గాయమైంది. సిడ్నీలోని ఓ ఆసుపత్రిలో రెండు రోజులపాటు ఐసీయూలో చికిత్స చేయించుకున్నాడు. పెద్ద ప్రాణాపాయం తప్పిందని వైద్యులు కూడా చెప్పారు. అక్కడి నుంచి డిశ్చార్జి అయి శ్రేయస్ స్వదేశానికి వచ్చాడు. అప్పటి నుంచి డాక్టర్ దిన్షా పార్థివాలా.. అయ్యర్ ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ఇటీవల అతను అల్ట్రాసోనోగ్రఫీ పరీక్ష చేయించుకోగా.. మెరుగుదల కనిపిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. అయితే కడుపుపై ఒత్తిడిని కలిగించే కార్యకలాపాలకు దూరంగా ఉండాలని సూచించారు. అయ్యర్ పూర్తిగా కోలుకోవడానికి రెండు నెలలకు పైగా సమయం పట్టనుంది. జనవరి 11 నుంచి న్యూజిలాండ్‌తో జరిగే వన్డే సిరీస్‌కు కూడా శ్రేయస్ అందుబాటులోకి ఉండడు. ఫిట్‌నెస్‌ సాధించినా మ్యాచ్‌ ప్రాక్టీస్‌ ఉండదు కాబట్టి ఫిబ్రవరి-మార్చి నెలల్లో జరిగే టీ20 ప్రపంచకప్‌ ఎంపికకు శ్రేయస్‌ పేరును సెలక్టర్లు పరిగణనలోకి తీసుకోవడం కష్టమే.


ఇవి కూడా చదవండి:

నాలుగో రోజు ముగిసిన ఆట

రికార్డు సృష్టించిన జడేజా

Updated Date - Nov 25 , 2025 | 06:44 PM