Ind Vs SA: నాలుగో రోజు ముగిసిన ఆట
ABN , Publish Date - Nov 25 , 2025 | 04:32 PM
దక్షిణాఫ్రికాతో టెస్టులో టీమిండియా తడబడుతోంది. రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్.. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి రెండు వికెట్లు కోల్పోయి 27 పరుగులు చేసింది. ఈ మ్యాచ్ గెలవాలంటే భారత్ ఇంకా 522 పరుగులు చేయాలి.
ఇంటర్నెట్ డెస్క్: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా ఆట ఓటమి లాంఛనమే అన్నట్టు సాగుతోంది. 26/0 ఓవర్ నైట్ స్కోరుతో నాలుగో రోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన ప్రొటీస్ జట్టు ఐదు వికెట్లు కోల్పోయి 260 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం 288 కలిపి టీమిండియా(Team India)కు 549 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది.
తడబడుతున్నారు..
లక్ష్య ఛేదనకు దిగిన భారత్.. తడబడుతోంది. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి రెండు వికెట్లు నష్టపోయి 27 పరుగులు చేసింది. సాయి సుదర్శన్(2), నైట్ వాచ్‌మెన్‌గా వచ్చిన కుల్దీప్ యాదవ్(4) క్రీజులో ఉన్నారు. ఆదిలోనే ఓపెనర్లు యశస్వి జైస్వాల్(13), కేఎల్ రాహుల్(6) పెవిలియన్ బాట పట్టారు. ఇంకా ఒక్క రోజు ఆట మిగిలి ఉంది. భారత్ 522 పరుగుల వెనుకంజలో ఉంది.
వైట్‌వాష్ తప్పదా?
ఆ ఆధిక్యాన్ని.. మన బ్యాటర్ల తీరును చూస్తే ఈ సిరీస్ కూడా వైట్‌వాష్ అయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఒకవేళ 1-1తో సమం చేయాలంటే టీమిండియా ఈ మ్యాచ్‌లో కచ్చితంగా గెలవాలి. కానీ అది ఏదో అద్భుతం జరిగితే గానీ కష్టం. చివరి రోజు భారత బ్యాటర్లు గట్టిగా పోరాడి మూడు సెషన్లపాటు బ్యాటింగ్ చేయగలిగితే మ్యాచ్‌ను కనీసం డ్రాగానైనా ముగించొచ్చు. మరి సఫారీ బౌలర్లను మనోళ్లు ఏమాత్రం ఎదుర్కొంటారో చూడాలి.
ఇవి కూడా చదవండి:
సౌతాఫ్రికా డిక్లేర్.. భారత్ టార్గెట్ 549
మరోసారి ఆసుపత్రిలో చేరిన పలాశ్