Share News

Ro-Ko: అదే జరిగితే.. సచిన్-ద్రవిడ్ రికార్డు బ్రేక్!

ABN , Publish Date - Nov 28 , 2025 | 07:52 PM

త్వరలోనే సౌతాఫ్రికాతో టీమిండియా మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. ఇప్పటికే కోహ్లీ-రోహిత్ శర్మ సిద్ధమయ్యారు. తొలి వన్డేలో రో-కో జోడీ ఓ అరుదైన రికార్డుపై కన్నేశారు.

Ro-Ko: అదే జరిగితే.. సచిన్-ద్రవిడ్ రికార్డు బ్రేక్!
Ro-Ko

ఇంటర్నెట్ డెస్క్: నవంబర్ 30 నుంచి టీమిండియా-సౌతాఫ్రికా జట్లు మూడు వన్డేల సిరీస్ ఆడనున్నాయి. తొలి మ్యాచ్ రాంచీ వేదికగా ప్రారంభం కానుంది. అయితే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ చేరికతో వన్డే జట్టు బలంగా కనిపిస్తోంది. వన్డే సిరీస్ గెలిచి, టెస్టు సిరీస్ ఓటమి బాధ నుంచి బయటపడాలని టీమిండియా అభిమానులు కోరుకుంటున్నారు.


ఈ నేపథ్యంలో రోహిత్-విరాట్(Ro-Ko) ముందు ఓ గొప్ప మైలురాయి ఉంది. వీరిద్దరూ రాంచీ వన్డేలో క్రీజులో నిలబడితే చాలు.. సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్ రికార్డ్ బ్రేక్ అవుతుంది! భారత క్రికెట్ చరిత్రలో రో-కో జోడీకి మంచి క్రేజ్ ఉంది. వీరద్దరూ కలిసి ఎన్నో విలువైన ఇన్నింగ్స్ ఆడటం మాత్రమే కాదు.. మంచి భాగస్వామ్యాలు కూడా నెలకొల్పారు. వీరిద్దరూ జోడీగా టీమిండియా తరఫున 391 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడారు. సచిన్, ద్రవిడ్ కూడా సరిగ్గా ఇన్నే మ్యాచ్‌లు జోడీగా ఆడారు. రాంచీ వన్డేతో రో-కో.. జోడీగా ఆడిన అంతర్జాతీయ మ్యాచ్‌ల సంఖ్య పెరుగుతుంది. భారత జట్టు పరంగా ఇది రికార్డే. మరే విజయవంతమైన జోడీ కూడా ఇన్ని మ్యాచ్‌లు ఆడలేదు. అలాగే విరాట్‌ కోహ్లీ, రవీంద్ర జడేజా ఇప్పటి వరకు టీమ్‌ఇండియా తరఫున 309 అంతర్జాతీయ మ్యాచుల్లో జోడీగా ఆడారు.


అత్యధిక అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన జోడీలు

  • రోహిత్ శర్మ - విరాట్‌ కోహ్లీ - 391*

  • సచిన్ టెండూల్కర్‌ - రాహుల్ ద్రవిడ్‌ - 391

  • రాహుల్‌ ద్రవిడ్‌ - సౌరవ్‌ గంగూలీ - 369

  • సచిన్ టెండూల్కర్‌ - అనిల్‌ కుంబ్లే - 367

  • సచిన్ టెండూల్కర్‌ - సౌరవ్‌ గంగూలీ - 341

  • విరాట్‌ కోహ్లీ - రవీంద్ర జడేజా - 309


ఇవి కూడా చదవండి:

అమ్మకానికి ఐపీఎల్ జట్లు.. హర్ష గొయెంకా పోస్ట్ వైరల్!

మహిళల టీ20 సిరీస్.. పూర్తి షెడ్యూల్ ఇదే!

Updated Date - Nov 28 , 2025 | 07:53 PM