Lionel Messi: హైదరాబాద్‌కు ఫుట్‌బాల్ దిగ్గజం మెస్సి
ABN , Publish Date - Nov 28 , 2025 | 06:00 PM
ఫుట్‌బాల్ స్టార్ ప్లేయర్ లియోనల్ మెస్సి భారత్‌లో పర్యటించనున్నాడు. ఈ టూర్‌లో భాగంగా డిసెంబర్ 13న హైదరాబాద్‌కు రానున్నాడు. ఈ విషయాన్ని అతడే సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు.
ఇంటర్నెట్ డెస్క్: లియోనల్ మెస్సి.. ఫుట్‌బాల్ ఆట గురించి తెలిసిన ప్రతి ఒక్కరికి ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. అతడిని అర్జెంటీనా అయినా.. ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఆయన సొంతం. ఆయన్ను చూడాలని కోరుకునే ఫ్యాన్స్ ఎంతో మంది. మరి ఈ ఫుట్‌బాల్ దిగ్గజం హైదరాబాద్ వస్తే..! మెస్సి భారత్‌లో పర్యటించనున్న విషయం తెలిసిందే. అయితే ఈ లెజెండరీ డిసెంబర్ 13న హైదరాబాద్‌లో కూడా అడుగు పెట్టనున్నాడు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అతడే(Lionel Messi) ప్రకటించాడు. తన ప్రయాణంలో హైదరాబాద్ కూడా ఉండటం ఎంతో ఆనందాన్ని కలిగిస్తుందని పేర్కొన్నాడు.
‘మరికొన్ని రోజుల్లో ఇండియాకు నా ప్రయాణం ప్రారంభం కానుంది. నా పై ఇండియా చూపిస్తున్న ప్రేమకు ధన్యవాదాలు. నా ప్రయాణంలో హైదరాబాద్ కూడా ఉంది. నా విజిట్‌లో ఈ సిటీని జోడించడం నాకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది’ అని మెస్సి ఇన్‌స్టా వేదికగా పోస్ట్ పెట్టాడు. కాగా ఈ అర్జెంటీనా స్టార్ ఫుట్‌బాల్ ప్లేయర్ హైదరాబాద్‌తో పాటు కోల్‌కతా, ముంబై, ఢిల్లీలో పర్యటించనున్నాడు.
సీఎం ట్వీట్..
‘డిసెంబర్ 13న ఫుట్‌బాల్ స్టార్ మెస్సి హైదరాబాద్ వస్తున్నాడు. అతడిని చూడాలని తపిస్తో్న్న ప్రతి అభిమాని కల ఆరోజు నెరవేరబోతోంది. మెస్సికి అందరం ఘన స్వాగతం పలుకుదాం’ అని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఎక్స్ వేదికగా ట్వీట్ చేశాడు.
ఇవి కూడా చదవండి:
అమ్మకానికి ఐపీఎల్ జట్లు.. హర్ష గొయెంకా పోస్ట్ వైరల్!
మహిళల టీ20 సిరీస్.. పూర్తి షెడ్యూల్ ఇదే!