Share News

IPL 2026 Trades: రాజస్థాన్ రాయల్స్ లోకి జడేజా.. సీఎస్కే చెంతకు సంజు

ABN , Publish Date - Nov 15 , 2025 | 12:20 PM

ఐపీఎల్ 2026 మినీ వేలానికి ముందు ఓ భారీ డీల్ సక్సెస్ అయింది. స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా రాజస్థాన్ రాయల్స్ జట్టులో చేరనున్నాడు.

IPL 2026 Trades: రాజస్థాన్ రాయల్స్ లోకి జడేజా.. సీఎస్కే చెంతకు సంజు
Ravindra Jadeja trade

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 మినీ వేలాని(IPL trades)కి ముందు ఆయా ఫ్రాంఛైజీల మధ్య జరుగుతున్న ట్రేడ్ క్రికెట్ అభిమానుల్లో ఉత్కంఠ రేపుతోంది. తాజాగా ఎనిమిది మంది ప్లేయర్ల ట్రేడ్ పూరైనట్లు ఐపీఎల్ ద్రవీకరించింది. ఇదే సమయంలో ఓ భారీ డీల్ సక్సెస్ అయింది. రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య స్వాప్ ట్రేడ్ డీల్ అధికారికంగా పూరైంది. ముందునుంచి వార్తలు వస్తున్నట్లు గానే స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా(Ravindra Jadeja trade), సామ్‌ కరణ్‌ రాజస్థాన్‌ రాయల్స్‌ గూటికి, సంజు శాంసన్‌ చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టులోకి చేరారు.


గత సీజన్‌కు ముందు జడేజాను రూ.18 కోట్ల భారీ వెచ్చించి చెన్నై సూపర్ కింగ్స్ రిటైన్ చేసుకుంది. ఇప్పుడు జడేజా ధరను రూ.14 కోట్లకు తగ్గించి రాజస్థాన్ ట్రేడ్ చేసుకుంది. ఐపీఎల్ 2026 సీజన్‌లో రవీంద్ర జడేజా రూ.14 కోట్లు అందుకోబోతున్నాడు. అలానే సామ్ కరణ్ ను రూ. 2.4 కోట్ల ప్రస్తుత ధరకే రాయల్స్ తమ జట్టులోకి తీసుకుంది. ఇదే సమయంలో సంజూ శాంసన్(Sanju Samson retention) ధర మాత్రం మారలేదు. అతడు రూ.18 కోట్ల ధరతో సీఎస్‌కే గూటికి చేరుకున్నాడు. ఈ ట్రేడ్ డీల్‌ను చెన్నై యాజమాన్యం సోషల్ మీడియా వేదికగా ధ్రువీకరించింది. ఇప్పటి వరకు జడేజా తమ ఫ్రాంచైజీకి ప్రాతినిథ్యం వహించినందుకు సీఎస్‌కే యాజమాన్యం ధన్యవాదాలు తెలిపింది. జడేజా(Ravindra Jadeja) 12 సీజన్ల పాటు చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడిన సంగతి తెలిసిందే.


ఐపీఎల్ 2026 వేలానికి ముందు ఫ్రాంఛైజీలు ఆటగాళ్ల రిటెన్షన్ జాబితాను సమర్పించడానికి నేడే ఆఖరి రోజు. దీంతో రాజస్థాన్, చెన్నై జట్ల తో పాటు మరికొన్ని ముఖ్యమైన ట్రేడ్ డీల్స్ జరిగాయి. సన్‌రైజర్స్ హైదరాబాద్ నుంచి స్టార్ పేసర్ మహ్మద్ షమీని రూ.10 కోట్లకు లక్నో సూపర్ జెయింట్స్ ట్రేడ్ చేసుకుంది. లెగ్ స్పిన్నర్ మయాంక్ మార్కండే( Mayank Markande trade)ను కోల్‌కతా నైట్‌రైడర్స్ నుంచి ముంబై ఇండియన్స్ రూ.30 లక్షల కనీస ధరకు తీసుకుంది. సచిన్ టెండూల్కర్ వారసుడు అర్జున్ టెండూల్కర్‌(Arjun Tendulkar Lucknow)ను ముంబై నుంచి ధర రూ.30 లక్షలకు లక్నో ట్రేడ్ చేసింది. నితీశ్‌ రాణా రాజస్థాన్‌ రాయల్స్‌ నుంచి ఢిల్లీ క్యాపిటల్స్‌కు, డోనోవన్ ఫెరీరా ఢిల్లీ క్యాపిటల్స్‌ నుంచి రాజస్థాన్‌ గూటికి చేరారు.


ఇవి కూడా చదవండి:

Virat Kohli 50th ODI Century: నేడు విరాట్‌కి ప్రత్యేకమైన రోజు.. బీసీసీఐ ప్రత్యేక పోస్టు!

మరో రికార్డుపై కన్నేసిన కేఎల్ రాహుల్..!

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Nov 15 , 2025 | 12:20 PM