Fatal Road Accident: హైదరాబాద్‌లో ఫైఓవర్‌పై ఘోర రోడ్డు ప్రమాదం
ABN , Publish Date - Nov 15 , 2025 | 11:42 AM
తెలంగాణలో వరుస రోడ్డు ప్రమాదాలు జరుగుతోండటంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. తాజాగా హైదరాబాద్‌లోని పీవీ నరసింహారావు ఎక్స్‌ప్రెస్ ఫ్లైఓర్‌పై ఓ కారు బోల్తాపడింది. అలాగే కరీంనగర్ జిల్లాలో ట్రాలీ ఆటో బోల్తాపడింది. ఈ రెండు ఘటనల్లో పలువురికి గాయాలయ్యాయి.
హైదరాబాద్, నవంబరు 15 (ఆంధ్రజ్యోతి): భాగ్యనగరంలోని పీవీ నరసింహారావు ఎక్స్‌ప్రెస్ ఫ్లైఓర్‌పై ఇవాళ (శనివారం) ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఫ్లై ఓవర్‌పై వేగంగా వెళ్తున్న కారు ఆకస్మాత్తుగా బోల్తా కొట్టింది. మెహిదీపట్నం నుంచి శంషాబాద్ వైపు వెళ్తుండగా టైర్ దెబ్బతినడంతో ఈ ప్రమాదం జరిగింది. పిల్లర్ నెంబర్ 25 వద్ద డివైడర్‌ని ఢీకొని కారు బోల్తా కొట్టింది. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందజేశారు. పోలీసులు హుటాహుటినా సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కారులో ముగ్గురు మహిళలతో పాటు ఓ చిన్నారి ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వారికి స్పల్ప గాయాలు అయ్యాయని వెల్లడించారు. ప్రమాదానికి గురైన కారు రోడ్డుపై అడ్డంగా పడటంతో భారీ ట్రాఫిక్ జామ్ అయ్యింది. పోలీసులు ఆ కారును పక్కకు తొలగించి ట్రాఫిక్ క్లియర్ చేశారు. కారును పక్కకు తీసి ట్రాఫిక్‌ను పోలీసులు క్రమబద్దీకరించారు.
కరీంనగర్ జిల్లాలో..
మరోవైపు.. కరీంనగర్ జిల్లాలోని జమ్మికుంట మండలం తనుగుల శివారులో ఇవాళ(శనివారం) రోడ్డు ప్రమాదం జరిగింది. మహిళా వ్యవసాయ కూలీలతో వెళ్తున్న ఆటో ట్రాలీ ఒక్కసారిగా బోల్తాపడింది. ఆటో ట్రాలీ బోల్తా పడటంతో నలుగురికి తీవ్ర గాయాలు కాగా, పలువురికి స్వల్ప గాయాలు అయ్యాయి. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందజేశారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ట్రాలీ వేగంగా వెళ్లడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ ప్రమాదంలో గాయపడ్డ వారిని జమ్మికుంట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వీణవంక మండలం ఎల్బాక గ్రామం నుంచి జమ్మికుంట మండలం నాగారం గ్రామానికి పత్తి తీయడానికి వెళ్తున్నామని వ్యవసాయ కూలీలు తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం ధరలు..
పది పరీక్షలకు 100 రోజుల ప్రణాళిక
Read Latest Telangana News and National News