Share News

Hero Vishal: హీరో విశాల్‌ - లైకా కేసు... విచారణ నుంచి తప్పుకున్న న్యాయమూర్తి

ABN , Publish Date - Nov 15 , 2025 | 11:49 AM

హీరో విశాల్‌, నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్‌ మధ్య కొనసాగుతున్న వివాదం కేసు విచారణ నుంచి న్యాయమూర్తి జయచంద్రన్‌ తప్పుకున్నారు. లైకా సంస్థకు విశాల్‌ రూ.21.30 కోట్ల రుణం చెల్లించాల్సి ఉంది. ఈ కేసు విచారణ మద్రాస్‌ హైకోర్టులో గత కొంతకాలంగా సాగుతోంది.

Hero Vishal: హీరో విశాల్‌ - లైకా కేసు... విచారణ నుంచి తప్పుకున్న న్యాయమూర్తి

చెన్నై: హీరో విశాల్‌(Hero Vishal), నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్‌ మధ్య కొనసాగుతున్న వివాదం కేసు విచారణ నుంచి న్యాయమూర్తి జయచంద్రన్‌ తప్పుకున్నారు. లైకా సంస్థకు విశాల్‌ రూ.21.30 కోట్ల రుణం చెల్లించాల్సి ఉంది. ఈ కేసు విచారణ మద్రాస్‌ హైకోర్టు(Madras High Court)లో గత కొంతకాలంగా సాగుతోంది. అయితే, ఈ కేసులో మొత్తం రుణానికి 30 శాతం వడ్డీతో కలిపి చెల్లించాలని న్యాయమూర్తులు జయచంద్రన్‌, ముమ్మినేనితో కూడిన ధర్మాసనం ఇటీవల తీర్పునిచ్చింది.


nani1.2.jpg

ఈ తీర్పుపై హీరో విశాల్‌(Hero Vishal) అప్పీల్‌ చేశారు. దీంతో న్యాయమూర్తి జయచంద్రన్‌ తప్పుకున్నారు. ఈ కేసుపై విచారణ ఇప్పటికే పూర్తయిందని, ఈ కేసులో కొన్ని అభిప్రాయాలను వెల్లడించడం జరిగిందంటూ న్యాయమూర్తి జయచంద్రన్‌ విచారణ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. పైగా ఈ కేసును మరో ధర్మాసనానికి బదిలీ చేయాలని రిజిస్ట్రీని ఆదేశించారు.


nani1.3.jpg

ఈ వార్తలు కూడా చదవండి..

గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం ధరలు..

పది పరీక్షలకు 100 రోజుల ప్రణాళిక

Read Latest Telangana News and National News

Updated Date - Nov 15 , 2025 | 11:49 AM