Kaushik Maity: ఎవరీ మిస్టరీ స్పిన్నర్?
ABN , Publish Date - Nov 19 , 2025 | 10:46 AM
సౌతాఫ్రికాతో ఓటమి తర్వాత టీమిండియా మేనేజ్‌మెంట్ బెంగాల్‌కు చెందిన ఓ స్పిన్నర్‌ను రంగంలోకి దింపింది. రెండు చేతులతో బౌలింగ్ వేయడం అతడి ప్రత్యేకత. ప్రొటీస్ స్పిన్నర్లను సమర్థంగా ఎదుర్కోవడానికి ఈ స్పిన్నర్‌తో నెట్స్‌లో బౌలింగ్ వేపిస్తున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: సౌతాఫ్రికాతో తొలి టెస్టులో స్పిన్నర్ల ధాటికి టీమిండియా ఘోర ఓటమిని చవి చూసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రొటీస్ బౌలర్లను ఎదుర్కొనేందుకు టీమ్ మేనేజ్‌మెంట్ ఓ మిస్టరీ స్పిన్నర్‌ను రంగంలోకి దించింది. తాజాగా టీమిండియా నెట్స్‌లో రెండు చేతులతో బౌలింగ్ వేస్తూ అందరి దృష్టిని తన వైపు తిప్పుకున్నాడు. అతడే బెంగాల్ స్పిన్నర్ కౌశిక్ మైతీ(Kaushik Maity).
నవంబర్ 22(శనివారం)న టీమిండియా-సౌతాఫ్రికా మధ్య గువాహటి వేదికగా రెండో టెస్టు ప్రారంభం కానుంది. దీంట్లో ప్రొటీస్ ఆఫ్ స్పిన్నర్ హార్మర్, స్పిన్నర్ కేశవ్ మహరాజ్‌ల నుంచి పొంచి ఉన్న ముప్పును సమర్థంగా ఎదుర్కొవాలనుకుంటున్న టీమిండియా.. ప్రాక్టీస్ కోసం మైతీని పిలిపించింది. రెండు చేతులతో బౌలింగ్ వేయడమే అతడి ప్రత్యేకత. ఎడమచేతి వాటం బ్యాటర్లకు ఆఫ్‌బ్రేక్స్, కుడిచేతి వాటం బ్యాటర్లకు లెఫ్ట్‌ఆర్మ్ స్పిన్ వేశాడు. ఈ 26 ఏళ్ల కౌశిక్.. ముస్తాక్ అలీ టోర్నీలో బెంగాల్‌కు ప్రాతినిధ్యం వహించాడు.
‘టీమిండియా నెట్స్‌లో బౌలింగ్ చేయడం నాకు ఇదే తొలిసారి. ఐపీఎల్(IPL) సందర్భంగా ఈడెన్ గార్డెన్స్‌లో వివిధ ఫ్రాంచైజీల నెట్స్‌లో బౌలింగ్ వేశా. ఈ రోజు సాయి సుదర్శన్, వాషింగ్టన్ సుందర్, జడేజా, పడిక్కల్‌కు ఆఫ్‌బ్రేక్స్ వేశా. ధ్రువ్ జురెల్‌కు ఎడమచేతి వాటం స్పిన్ వేశా’ అని కౌశిక్ మైతీ వెల్లడించాడు.
ఇవి కూడా చదవండి:
కోచ్ మ్యాచ్ ఆడడు కదా!: రాబిన్ ఉతప్ప
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి