Dinesh Karthik: ఇది అతడి కెరీర్‌కే ప్రమాదం: దినేశ్ కార్తీక్
ABN , Publish Date - Nov 19 , 2025 | 06:51 AM
వాషింగ్టన్ సుందర్‌ను మూడో స్థానంలో ఆడించడంపై టీమిండియా మాజీ క్రికెటర్ దినేశ్ కార్తీక్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీని వల్ల అతడి బౌలింగ్ కెరీర్ నాశనం అవుతుందని అభిప్రాయపడ్డాడు.
ఇంటర్నెట్ డెస్క్: కోల్‌కతా తొలి టెస్టులో పరాజయం పాలైన టీమిండియా.. రెండో టెస్టులో విజయం సాధించాలని పట్టుదలతో ఉంది. సౌతాఫ్రికా 30 పరుగుల తేడాతో భారత్‌పై విజయం సాధించింది. 124 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కూడా బ్యాటర్లు ఛేదించలేకపోయారు. దీంతో తుది జట్టు, పిచ్‌పై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో మాజీ క్రికెటర్ దినేశ్ కార్తీక్(Dinesh Karthik) చేసిన వ్యాఖ్యలు చర్చకు దారితీశాయి.
టెస్టు క్రికెట్‌లో 3వ స్థానం ఎంతో ముఖ్యమైనది. ఛెతెశ్వర్ పుజారా తర్వాత ఆ స్థానంలో ఎవరూ నిలకడగా రాణించలేకపోయారు. ఇప్పటికీ వన్ డౌన్‌పై ప్రయోగాలు జరుగుతూనే ఉన్నాయి. అయితే కోల్‌కతా టెస్టులో వాషింగ్టన్ సుందర్‌ను 3వ స్థానంలో ఆడించడంపై దినేశ్ కార్తీక్ మాట్లాడాడు. ఇది సుందర్ కెరీర్‌కే ప్రమాదమని హెచ్చరించాడు.
‘టెస్టు క్రికెట్‌లో వాషింగ్టన్ సుందర్(Washington Sundar)ను ఎలా చూస్తున్నారు? బ్యాటింగ్ ఆల్‌రౌండర్‌గా? బౌలింగ్ ఆల్‌రౌండర్‌గా? అతడిని మూడో స్థానంలో బ్యాటింగ్‌కు పంపించారు. బ్యాటింగ్‌పై ఎక్కువ ఫోకస్ పెట్టాలని పరోక్షంగా సూచిస్తున్నారు. ఇది ఇలాగే కొనసాగిస్తే అతడు పూర్తిగా బ్యాటింగ్‌పైనే ఫోకస్ పెడతాడు. అది అతడి బౌలింగ్‌పై ప్రభావం చూపుతుంది. సుందర్ బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లోనూ రాణించగలడు. కానీ అడినికి బ్యాటర్‌గా ప్రమోట్ చేస్తే రెండింట్లో రాణించలేడు. మరిన్ని మ్యాచుల్లో సుందర్‌ను మూడో స్థానంలో ఆడిస్తే అతడి బౌలింగ్ దెబ్బతింటుంది. అది అతడి కెరీర్‌కే ప్రమాదం’ అని దినేశ్ కార్తీక్ హెచ్చరించాడు.
ఇవి కూడా చదవండి:
IND VS BAN Women’s Series: భారత్-బంగ్లాదేశ్ సిరీస్‌పై కీలక అప్ డేట్
NZ VS WI: న్యూజిలాండ్‌కు భారీ షాక్.. కీలక ప్లేయర్ ఔట్
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి