Uthappa: కోచ్ మ్యాచ్ ఆడడు కదా!: రాబిన్ ఉతప్ప
ABN , Publish Date - Nov 19 , 2025 | 08:29 AM
సౌతాఫ్రికాపై టీమిండియా 30 పరుగుల తేడాతో ఓడిన సంగతి తెలిసిందే. దీంతో పిచ్, కోచ్‌పై విమర్శలు వస్తూనే ఉన్నాయి. తాజాగా గంభీర్‌కు మద్దతుగా నిలిస్తూ టీమిండియా మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్ప ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
ఇంటర్నెట్ డెస్క్: స్వదేశంలో టీమిండియా మ్యాచ్ ఓడిపోవడాన్ని మాజీ క్రికెటర్ల నుంచి అభిమానుల వరకు జీర్ణించుకోలేకపోతున్నారు. సౌతాఫ్రికాపై 124 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించలేకపోవడమే దీనికి ప్రధాన కారణం. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు పిచ్, కోచ్‌పై విమర్శలు వస్తూనే ఉన్నాయి. హెడ్ కోచ్ గంభీర్ నిర్ణయాల వల్లే స్వదేశంలో మ్యాచ్‌లు ఓడుతున్నామని తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో గంభీర్‌కు మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్ప(Robin Uthappa) మద్దతుగా నిలిచాడు.
‘గంభీర్(Gambhir)కు అండగా ఉంటున్నావ్.. అంటూ ఓ కామెంట్ వచ్చింది నాకు. అవును! నేను ఉంటాను. ఎందుకంటే అక్కడ మ్యాచ్ ఆడేది కోచ్ కాదు. మ్యాచ్ ఓడితే కోచ్‌ను ఎందుకు నిందిస్తున్నారు? నిర్ణయాలు కోచ్ తీసుకున్నా.. ఆడిది ప్లేయర్లు. రాహుల్ ద్రవిడ్‌ని కూడా ఇలానే విమర్శించారు. 20-30వేల అంతర్జాతీయ పరుగులు చేయడం అంత సులువు కాదు. కోచ్‌ని ట్రోల్ చేస్తే అందరినీ చేసినట్టే అనుకోవడం పొరపాటు’ అని ఉతప్ప తెలిపాడు.
శిక్షిస్తారు..
అంతర్జాతీయ టెస్ట్ మ్యాచ్ ఒకటి, రెండు రోజుల్లో ముగిసిపోతే క్యురేటర్లను శిక్షిస్తారు. ఇక్కడ పిచ్‌లు తయారు చేయడం క్యురేటర్ల పని. వారిని ప్రశ్నించే హక్కు ఎవ్వరికీ ఉండదు. అయితే రంజీల్లో మాత్రమే మనకు నచ్చినట్లు పిచ్ తయారు చేయించుకోవచ్చు. టర్నింగ్ పిచ్‌లను తయారు చేయమని ఎవరినీ ప్రోత్సహించలేదు. మూడు, నాలుగో రోజు బంతి బాగా టర్న్ అవుతుంది. దీని వల్ల స్పిన్‌కు బాగా ఆడగలిగే ఆటగాళ్లను తయారు చేయొచ్చనే ఉద్దేశమే ఉంది. ఇలాంటి కండిషన్స్‌లో బ్యాటింగ్ చేస్తే ఇలాంటి పిచ్‌లు ఆడగాళ్లకు అలవాటు అవుతాయి. దీన్ని ఓ పాఠంగా తీసుకుని టీమిండియా మళ్లీ పుంజుకుంటుంది’ అని ఉతప్ప వివరించాడు.
ఇవి కూడా చదవండి:
‘వర్క్‌లోడ్’ సాకుగా మారింది: సునీల్ గావస్కర్
ఇది అతడి కెరీర్‌కే ప్రమాదం: దినేశ్ కార్తీక్
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి