Share News

KL Rahul: మరో రికార్డుపై కన్నేసిన కేఎల్ రాహుల్..!

ABN , Publish Date - Nov 13 , 2025 | 10:59 AM

టీమిండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ ఓ కీలక మైలురాయికి చేరువలో ఉన్నాడు. సౌతాఫ్రికాతో టెస్ట్ సిరీస్‌లో అతడు 4వేల పరుగుల మైలురాయిని అందుకునే అవకాశముంది. కేఎల్ ఇప్పటివరకు 65 టెస్టుల్లో 3,985 పరుగులు సాధించాడు.

KL Rahul: మరో రికార్డుపై కన్నేసిన కేఎల్ రాహుల్..!
KL Rahul

ఇంటర్నెట్ డెస్క్: నవంబర్ 14 నుంచి టీమిండియా-సౌతాఫ్రికా మధ్య రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్ కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్(Eden Gardens) వేదికగా జరగనుండగా.. రెండో మ్యాచ్‌కు గువాహటి ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ నేపథ్యంలో టీమిండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్(KL Rahul) కీలక మైలురాయికి చేరువలో ఉన్నాడు. టెస్ట్ క్రికెట్‌లో 4వేల పరుగుల మైలురాయికి కేవలం 15 పరుగులు మాత్రమే కావాల్సి ఉంది. కాబట్టి సౌతాఫ్రికాతో తొలి టెస్టులో కేఎల్ ఆ రికార్డును సాధించే అవకాశం ఉంది.


తుది జట్టులో ఉంటాడా?

సౌతాఫ్రికాతో టెస్టులో టీమిండియా(Team India) తుది జట్టుపై సందిగ్ధత నెలకొంది. ఇప్పటికే ధ్రువ్ జురెల్‌ను జట్టులోకి తీసుకుని.. స్టార్ ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డిని పక్కన పెట్టిన సంగతి తెలిసిందే. కాగా భారత్-సౌతాఫ్రికా టెస్ట్ సిరీస్‌లో కేఎల్ రాహుల్ ఓపెనర్‌గా బరిలోకి దిగే అవకాశం ఉంది. ఇప్పటివరకు రాహుల్ 65 టెస్టులు ఆడి 3,985 పరుగులు సాధించాడు. ఇక 15 పరుగులు చేస్తే, 4వేల పరుగుల మైలురాయిని అందుకుంటాడు. ఇది జరిగితే ఈ ఫీట్ అందుకున్న 18వ భారత బ్యాటర్‌గా కేఎల్ రాహుల్ నిలుస్తాడు.


అదే ఫామ్ కొనసాగిస్తారా?

ఇటీవలే ఆస్ట్రేలియాపై 2-1 తేడాతో టీ20 సిరీస్ గెలిచిన టీమిండియా జోష్‌లో ఉంది. గత టెస్ట్ సిరీస్‌లో వెస్టిండీస్‌పై విజయం సాధించిన ఈ జట్టు ఈ సారి కూడా అదే ఫామ్ కొనసాగించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే డిఫెండింగ్‌ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్స్ అయిన సౌతాఫ్రికా జట్టును కూడా అంత తేలికగా తీసుకోవడానికి లేదు. అదే కాకుండా.. గత 15 ఏళ్లుగా భారత గడ్డపై ఒక్క టెస్ట్ మ్యాచ్ కూడా గెలవని సఫారీ సేన.. ఈసారి సిరీస్ పట్టాలని ఉవ్విళ్లూరుతోంది. మరి కేఎల్ రాహుల్ తన అద్భుత ఫామ్‌తో భారత్‌కు బలమైన ఆరంభం అందిస్తాడో.. లేదో? చూడాల్సి ఉంది.


ఇవి కూడా చదవండి

ఏ ఫ్రాంచైజీ ఎవరిని తీసుకుంటుందో!

15 ఏళ్లలో ఇదే తొలిసారి!

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Nov 13 , 2025 | 10:59 AM