Laura Wolvaardt: వోల్వార్ట్‌కు ప్రతిష్టాత్మక అవార్డు
ABN , Publish Date - Nov 13 , 2025 | 07:38 AM
ఐసీసీ అక్టోబర్ 2025 నెలకు సంబంధించిన అవార్డులను విడుదల చేసింది. దీంట్లో దక్షిణాఫ్రికా కెప్టెన్ లారా వోల్వార్ట్ ‘ప్లేయర్ ఆఫ్ ది మంత్’ అవార్డును దక్కించుకుంది. అక్టోబర్ నెలలో అత్యుత్తమ ప్రదర్శనలకు గానూ లారాకు ఈ అవార్డు దక్కింది.
ఇంటర్నెట్ డెస్క్: ఐసీసీ మహిళల వన్డే ప్రపంచ కప్ 2025.. సౌతాఫ్రికాతో తలపడి టీమిండియా సంచలన విజయం నమోదు చేసిన సంగతి తెలిసిందే. 47 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదింపుతూ ట్రోఫీని ముద్దాడింది. అయితే ఫైనల్ మ్యాచ్‌లో సఫారీ సేన పోరాడి ఓడింది. ముఖ్యంగా సౌతాఫ్రికా కెప్టెన్ లారా వోల్వార్ట్.. టోర్నీ మొత్తం అద్భుత ప్రదర్శన చేసింది. ఈ నేపథ్యంలో వోల్వార్ట్‌కు ప్రతిష్టాత్మక అవార్డు దక్కింది.
ఐసీసీ(ICC) అక్టోబర్ 2025 నెలకు సంబంధించిన అవార్డులను విడుదల చేసింది. దీంట్లో దక్షిణాఫ్రికా కెప్టెన్ లారా వోల్వార్ట్(Laura Wolvaardt) ‘ప్లేయర్ ఆఫ్ ది మంత్’ అవార్డును దక్కించుకుంది. అక్టోబర్ నెలలో అత్యుత్తమ ప్రదర్శనలకు గానూ లారాకు ఈ అవార్డు దక్కింది. వన్డే ప్రపంచ కప్ 2025లో లీడింగ్ రన్ స్కోరర్‌గా నిలిచిన ఆమె.. ఎనిమిది మ్యాచ్‌లు ఆడి 470 పరుగులు చేసింది.
గర్వంగా ఉంది..
ఇంగ్లండ్‌తో జరిగిన సెమీస్‌లో భారీ సెంచరీ(169) చేసి లారా సఫారీ జట్టును ఫైనల్‌కు చేర్చింది. టీమిండియాతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లోనూ సెంచరీతో ఆకట్టుకుంది. ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు గెలుచుకున్న తర్వాత లారా మాట్లాడింది. ‘ఈ అవార్డు సాధించడం చాలా గర్వంగా అనిపిస్తుంది. ప్రపంచ కప్ టైటిల్ గెలవకపోయినా.. మా పోరాటం చరిత్రలో నిలిచిపోతుంది’ అని తెలిపింది.
పురుషుల విభాగంలోనూ..
అక్టోబర్ నెలకు సంబంధించిన ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు పురుషుల విభాగంలోనూ సౌతాఫ్రికానే వరించింది. ఆ జట్టు స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ సెనురన్ ముత్తసామి(Senuran Muthusamy) ఈ అవార్డుకు ఎంపికయ్యాడు. అక్టోబర్‌లో పాకిస్తాన్‌తో జరిగిన రెండు టెస్టుల్లో అతడు విశేషంగా రాణించాడు. తొలి టెస్టులో 11 వికెట్లు, రెండో టెస్టులో 89 పరుగులు చేశాడు. ఈ సిరీస్ 1-1తో డ్రాగా ముగిసింది.
ఇవి కూడా చదవండి
సంజూని తీసుకోవడం పిచ్చి నిర్ణయం: మాజీ క్రికెటర్
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి