Share News

IPL 2026: ఎంఐ నుంచి అర్జున్ ఔట్!

ABN , Publish Date - Nov 12 , 2025 | 09:38 PM

ముంబై ఇండియన్స్ అర్జున్ టెండూల్కర్‌ను జట్టు నుంచి విడుదల చేయనుందని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అర్జున్ స్థానంలో శార్దూల్ ఠాకూర్‌ను తీసుకునేందుకు ఎల్ఎస్‌జీతో ట్రేడ్ జరుపుతున్నట్లు సమాచారం.

IPL 2026: ఎంఐ నుంచి అర్జున్ ఔట్!
Arjun Tendulkar

ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్‌ 2026 సీజన్‌కు రిటెన్షన్ గడువు దగ్గరపడుతున్న తరుణంలో జట్లన్నీ తమ జాబితాలను ఖరారు చేసే పనిలో బిజీగా ఉన్నాయి. నవంబర్‌ 15వ తేదీతో రిటెన్షన్‌ గడువు ముగియనుంది. ఇదే సమయంలో చెన్నై సూపర్‌ కింగ్స్‌(CSK) జట్టు స్టార్ ఆల్‌రౌండర్లు‌ రవీంద్ర జడేజా–సామ్‌ కరన్‌లను రాజస్థాన్‌ రాయల్స్‌ కెప్టెన్‌ సంజూ శాంసన్‌తో ట్రేడ్‌ చేయాలన్న వార్తలు చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ముంబై ఇండియన్స్(MI) ఫ్రాంచైజీ నుంచి ఓ ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది.


క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్(Arjun Tendulkar) ఐపీఎల్‌లో ముంబై తరఫున ఆడుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ ఏడాది ఎంఐ అర్జున్‌ టెండూల్కర్‌ను విడిచి పెట్టేందుకు యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ముంబై ఇండియన్స్‌, లక్నో సూపర్‌ జెయింట్స్‌ (ఎల్ఎస్జీ) జట్లు అర్జున్‌ టెండూల్కర్‌, శార్దూల్‌ ఠాకూర్‌‌(Shardul Thakur)ను ట్రేడ్ చేసే దిశగా చర్చలు జరుపుతున్నాయట.


ఐదే మ్యాచ్‌లు.. మూడు వికెట్లు

ఐపీఎల్ 2023‌లో ముంబై తరఫున అరంగేట్రం చేసిన అర్జున్‌ టెండూల్కర్‌ ఇప్పటివరకు ఐదు మ్యాచ్‌లు మాత్రమే ఆడి మూడు వికెట్లు తీశాడు. అయినప్పటికీ ఐపీఎల్‌ 2025 మెగా వేలంలో ముంబై ఇండియన్స్‌ అతడిని రూ.30 లక్షల బేస్‌ ప్రైస్‌కి తిరిగి తీసుకుంది. ఇక శార్దూల్‌ ఠాకూర్‌ విషయానికి వస్తే... ఐపీఎల్‌ 2025 వేలంలో ఏ జట్టూ అతడిని ఎంచుకోలేదు. కానీ లక్నో సూపర్‌ జెయింట్స్‌ తమ బౌలర్‌ మోహ్సిన్‌ ఖాన్‌ గాయపడటంతో అతడి స్థానంలో జట్టులో చోటు కల్పించింది. లక్నో తరఫున పది మ్యాచ్‌ల్లో శార్దూల్‌ 13 వికెట్లు పడగొట్టాడు.


ఇవి కూడా చదవండి

మోర్నీ ఇప్పుడు మాకు శత్రువు: గ్రేమ్ స్మిత్

టీమిండియాలో హైదరాబాద్ కుర్రాడు!

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Nov 12 , 2025 | 09:38 PM