ISSF World Championship: చరిత్ర సృష్టించిన సామ్రాట్
ABN , Publish Date - Nov 12 , 2025 | 09:09 PM
భారత షూటర్ సామ్రాట్ రాణా ఐఎస్ఎస్ఎఫ్ వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో స్వర్ణం సాధించి చరిత్ర సృష్టించాడు. ఈ విభాగంలో పసిడి సాధించిన తొలి భారతీయుడిగా నిలిచాడు.
ఇంటర్నెట్ డెస్క్: భారత షూటర్ సామ్రాట్ రాణా(Samrat Rana) చరిత్ర సృష్టించాడు. ఈజిప్డు రాజధాని కైరోలో జరుగుతున్న ఐఎస్ఎస్ఎఫ్ వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో సామ్రాట్ మరో సంచలన విజయాన్ని నమోదు చేశాడు. పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో 243.7 స్కోర్ చేసి స్వర్ణం సాధించాడు. ఈ విభాగంలో ప్రపంచ టైటిల్ గెలిచిన తొలి భారతీయుడిగా సామ్రాట్ చరిత్ర సృష్టించాడు.
ఐదో భారతీయుడిగా..
బుధవారం జరిగిన ఫైనల్(ISSF World Championship)లో రాణా చైనా షూటర్ హు కైపై 0.4 పాయింట్ల తేడాతో గెలుపొందాడు. దీంతో 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ సింగిల్స్ విభాగంలో స్వర్ణం సాధించిన ఐదో భారతీయుడిగా కూడా సామ్రాట్ చరిత్ర సృష్టించాడు. ఈ జాబితాలో అభినవ్ బింద్రా, రుద్రాంక్ష్ పాటిల్, తేజస్విని సావంత్, శివ నర్వాల్-ఈషా సింగ్(మిక్స్‌డ్ టీమ్) ముందున్నారు. ఇదే ఈవెంట్‌లో మరో భారత షూటర్ వరుణ్ తోమార్ కాంస్యం గెలిచాడు. దీంతో ఈ ఈవెంట్‌లో భారత్‌కు డబుల్ పోడియం దక్కింది.
విఫలమైన మను బాకర్..
స్టార్ షూటర్ మను బాకర్(Manu Bhaker) ఈసారి నిరాశపర్చింది. అయితే సింగిల్స్ విభాగంలో విఫలమైనా.. టీమ్ ఈవెంట్‌లో సిల్వర్ మెడల్ సాధించింది. ఈషా సింగ్, సురుచి సింగ్‌లతో కలిసి మహిళా టీమ్ రజతం గెలుచుకుంది. మరోవైపు పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ సింగిల్స్ విభాగంలో సామ్రాట్ రాణా పసిడి గెలవడంతో ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో భారత పతకాల సంఖ్య తొమ్మిదికి చేరింది. ఇందులో మూడు గోల్డ్, మూడు సిల్వర్, మూడు బ్రాంజ్ ఉన్నాయి. పతకాల పట్టికలో 12 మెడల్స్‌తో చైనా అగ్రస్థానంలో ఉండగా.. భారత్ రెండో స్థానంలో నిలిచింది.
ఇవి కూడా చదవండి
మోర్నీ ఇప్పుడు మాకు శత్రువు: గ్రేమ్ స్మిత్
టీమిండియాలో హైదరాబాద్ కుర్రాడు!
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి