Team India U19: టీమిండియాలో హైదరాబాద్ కుర్రాడు!
ABN , Publish Date - Nov 12 , 2025 | 07:07 PM
హైదరాబాద్ యువ క్రికెటర్ మాలిక్ టీమిండియా అండర్-19 జట్టులో చోటు దక్కించుకున్నాడు. వినూ మన్కడ్ ట్రోఫీలో అత్యధిక వికెట్లు తీసిన మాలిక్, టీమిండియా సీనియర్ జట్టు తరఫున ఆడాలనేది తన కల అని పేర్కొన్నాడు.
ఇంటర్నెట్ డెస్క్: టీమిండియా అండర్-19 జట్టుకు హైదరాబాద్ కుర్రాడు ఎంపికయ్యాడు. నాంపల్లిలోని మల్లెపల్లికి చెందిన ఈ యువ క్రికెటర్ మహ్మద్ అబ్దుల్ మాలిక్(Malik) ప్రస్తుతం ఫాస్ట్ బౌలర్‌గా రాణిస్తున్నాడు. ఇటీవలే జరిగిన వినూ మన్కడ్ ట్రోఫీ(Vinu Mankad Trophy)లో తన ప్రతిభతో అందరినీ ఆకట్టుకున్నాడు. ఈ టోర్నీలో మాలిక్ అత్యధిక వికెట్లు తీసి టాప్ వికెట్ టేకర్‌గా నిలిచాడు.
అదే నా కల..
పాఠశాల స్థాయి నుంచే క్రికెట్‌లో సత్తా చాటుతున్న మాలిక్‌కు 2022లో హైదరాబాద్ అండర్-16 జట్టులో చోటు దక్కింది. విజయ్ మర్చంట్ ట్రోఫీలో రాణించిన మాలిక్.. ఓ ట్రిపుల్ సెంచరీ సహా 511 పరుగులు సాధించాడు. ఈ ప్రదర్శనతో అతడికి మంచి గుర్తింపు వచ్చింది. ప్రస్తుతం మాలిక్ హైదరాబాద్‌లోని ఓ డిగ్రీ కాలేజీలో బీకామ్ చదువుతున్నాడు.
‘టీమిండియా తరఫున ఆడాలనేదే నా కల. ప్రస్తుతం నా ప్రదర్శన, లభిస్తున్న అవకాశాలు ఆ దిశగా నేను వేస్తున్న తొలి అడుగు. అండర్ 19లోకి వస్తే ఐపీఎల్ ఆడే అవకాశాలు కూడా మెరుగవుతాయి. ప్రస్తుతం ఈ అవకాశం నాకు ఎంతో గౌరవంగా అనిపిస్తోంది’ అని మాలిక్ వెల్లడించాడు. అయితే అఫ్గానిస్తాన్ అండర్-19 జట్టుతో జరిగే సిరీస్‌కు బీసీసీఐ ఇరు జట్లను ప్రకటించింది. దీంట్లో మాలిక్ చోటు దక్కించుకున్నాడు. ఈ సిరీస్ నవంబర్ 17 నుంచి బెంగళూరులో ప్రారంభం కానుంది.
ఇవి కూడా చదవండి
వన్డే ర్యాంకింగ్స్.. టాప్-5లో విరాట్ కోహ్లీ
రెండో పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన రషీద్ ఖాన్
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి