Harmanpreet Reveals Her Favourite: తనకు ఇష్టమైన క్రికెటర్ ఎవరో చెప్పిన హర్మన్ ప్రీత్ కౌర్
ABN , Publish Date - Nov 13 , 2025 | 03:55 PM
భారత మహిళా జట్టు కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్‌ను చెన్నైలోని ఓ స్కూలు యాజమాన్యం సత్కరించింది. ఈ సందర్భంగా ఆ పాఠశాల విద్యార్థులు ఆమెతో కాసేపు ముచ్చటించారు. ఈ క్రమంలో తనకు ఇష్టమైన క్రికెటర్ ఎవరు అనే విషయాన్ని హర్మన్ రివీల్ చేసింది.
మహిళల వన్డే ప్రపంచ కప్(ODI World Cup 2025) గెలవడం భారతీయుల ఎన్నో దశాబ్దాల కల. ఆ కోరిక ఇటీవలే నిజమైంది. తొలిసారి భారత మహిళా జట్టు వన్డే ప్రపంచకప్ ను గెలిచింది. ఫైనల్ మ్యాచ్ లో సౌతాఫ్రికాను ఓడించి..టీమిండియా విశ్వ విజేతగా నిలిచింది. ఈ క్రమంలో హర్మన్ ప్రీత్ కౌర్ బృందానికి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. అంతేకాక వివిధ రాష్ట్రాల ప్రభుత్వాలు వరల్డ్ కప్ విన్నర్లను సన్మానిస్తున్నారు. కొన్ని విద్యా్సంస్థలు ఈ విజేతలను ముఖ్య అతిథులుగా ఆహ్వానిస్తున్నారు. ఈ క్రమంలో ఓ స్కూల్ ఈవెంట్ కు హాజరైన భారత మహిళా జట్టు సారథి హర్మన్ ప్రీత్ కౌర్(Harmanpreet Kaur).. తనకు ఇష్టమైన క్రికెటర్ ఎవరో వెల్లడించింది.
భారత మహిళా జట్టు కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్‌ను చెన్నైలోని ఓ స్కూలు యాజమాన్యం సత్కరించింది. ఈ సందర్భంగా ఆ పాఠశాల విద్యార్థులు ఆమెతో కాసేపు ముచ్చటించారు. ఈ క్రమంలో ఆమెను ‘విరాట్ కోహ్లీ (Virat Kohli).. ఎంఎస్ ధోని (MS Dhoni).. వీరిలో మీ ఫేవరెట్ ఎవరు?’ అని అక్కడి విద్యార్థులు ప్రశ్నించారు. ఎంఎస్ ధోని తన ఫేవరెట్ క్రికెటరని ఆమె( Harmanpreet Kaur revealed MS Dhoni ) బదులిచ్చింది. అలాగే తనకు టీమిండియా మాజీ క్రికెటర్, డ్యాషింగ్ బ్యాటర్ వీరేంద్ర సెహ్వాగ్(Virender Sehwag) స్ఫూర్తిదాయకమని వెల్లడించింది. ‘ఏ ఫార్మాట్ క్రికెట్ అంటే ఇష్టం?’ అని విద్యార్థులు మరో ప్రశ్న అడగ్గా... తనకు టెస్ట్ ఫార్మాట్ అంటే ఇష్టమని హర్మన్ సమధానమిచ్చింది.
అనంతరం హర్మన్ ప్రీత్ (Harman preet Kaur) విద్యార్థులతో మాట్లాడుతూ.. జీవితంలో ఎదగడానికి, బాలికలు కష్టపడాలని సూచించింది. మహిళల క్రికెట్ పురోగతిపై ఆమె సంతోషం వ్యక్తంచేశారు. వరల్డ్ కప్ గెలవడంతో ప్రస్తుతం జనాలు క్రికెట్ గురించే మాట్లాడుతున్నారు. మహిళల క్రికెట్, పురుషుల క్రికెట్ అంటూ.. లింగభేదం చూపించడం లేదని తెలిపింది. ఇది ఎంతో శుభ పరిణామం. అలాగే క్రికెట్ చూస్తున్నవారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. స్టేడియాలు కూడా జనాలతో నిండిపోతున్నాయి. ఇది గర్వించ దగ్గ విషయమని హర్మన్ ప్రీత్ కౌర్ ఆనందం వ్యక్తంచేశారు. వన్డే ప్రపంచ కప్(ODI World Cup 2025) టోర్నీలో హర్మన్ ప్రీత్ కౌర్ అటు బ్యాటర్‌గానూ, ఇటు కెప్టెన్‌గానూ రాణించిన సంగతి తెలిసిందే.
ఇవి కూడా చదవండి:
Priyank Panchal: నేపాల్ ప్రీమియర్ లీగ్ ఆడనున్న భారత స్టార్ క్రికెటర్
మరో రికార్డుపై కన్నేసిన కేఎల్ రాహుల్..!
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి