Rohit Sharma: రోహిత్ శర్మపై మహారాష్ట్ర క్రికెట్ బోర్డు కీలక కామెంట్స్
ABN , Publish Date - Nov 13 , 2025 | 03:16 PM
విజయ్ హజారే, సయ్యద్ ముస్తాక్ టోర్నీలో టీమిండియా వెటరన్ స్టార్ ప్లేయర్ రోహిత్ శర్మ ఆడే విషయంపై మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ సెలెక్టర్ సంజయ్ పాటిల్ స్పందించాడు. ఈ ప్రచారంలో ఎలాంటి నిజం లేదని ఆయన కొట్టి పారేశాడు. విజయ్ హజారే, సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీల్లో ఆడాలనుకున్న విషయాన్ని రోహిత్ తమ దృష్టికి తేలేదని సంజయ్ స్పష్టం చేశాడు.
టీమిండియా స్టార్ ప్లేయర్ రోహిత్ శర్మకు దేశవాళీ క్రికెట్ గురించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. సౌతాఫ్రికాతో వన్డే సిరీస్ కు సన్నాహకంగా రోహిత్ దేశవాళీ వన్డే టోర్నీ అయినా విజయ్ హజారే టోర్నీలో ముంబై తరఫున ఆడేందుకు సిద్ధంగా ఉన్నాడని ప్రచారం జరుగుతోంది. ఈ టోర్నీలో పాల్గొనే విషయాన్ని రోహిత్(Rohit Sharma) మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్(MCA)కు తెలియజేశాడని, వారు కూడా సంతృప్తి వ్యక్తం చేశారనే ప్రచారం జరుగుతోంది. విజయ్ హజారే ట్రోఫీతో పాటు కుదిరితే దేశవాళీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలోనూ హిట్ మ్యాన్ పాల్గొంటాడని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
విజయ్ హజారే(Vijay Hazare Trophy), సయ్యద్ ముస్తాక్ టోర్నీలో రోహిత్ శర్మ ఆడే విషయంపై మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ సెలెక్టర్ సంజయ్ పాటిల్ స్పందించాడు. ఈ ప్రచారంలో ఎలాంటి నిజం లేదని ఆయన కొట్టి పారేశాడు. విజయ్ హజారే, సయ్యద్ ముస్తాక్ అలీ(Syed Mushtaq Ali Trophy) టోర్నీల్లో ఆడాలనుకున్న విషయాన్ని రోహిత్ తమ దృష్టికి తేలేదని సంజయ్ స్పష్టం చేశాడు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో రోహిత్ ముంబై తరఫున ఆడితే అది గొప్ప విషయమని ఆయన తెలిపాడు. దేశవాళీ క్రికెట్ లో రోహిత్ వంటి స్టార్ ప్లేయర్లు ఆడితే యువ ఆటగాళ్లకు ప్రేరణగా ఉంటుందని అన్నారు. ఆటగాళ్లు ఎంతటి వారైనా, జాతీయ జట్టు అవకాశాలు రావాలంటే దేశవాళీ క్రికెట్‌లో తప్పక ఆడాలని నిబంధనలు పెట్టిన బీసీసీఐ, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగర్కార్, కోచ్ గౌతమ్ గంభీర్‌కు కృతజ్ఞతలు తెలిపాడు.
మరోవైపు ఇటీవల కాలంలో టీమిండియా వెటరన్ స్టార్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి(Virat Kohli) భవిష్యత్‌పై అనేక వార్తలు వినిపించాయి. ప్రస్తుతం వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్న ఈ ఇద్దరూ.. 2027 వన్డే ప్రపంచకప్ వరకు ఆడాలని భావిస్తున్నారు. ఇది జరగాలంటే వీరిద్దరి ఫిట్‌నెస్‌తో పాటు ఫామ్‌ను కాపాడుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే బీసీసీఐ రోహిత్, కోహ్లికు దేశవాళీ టోర్నీల్లో ఆడాలని సూచించినట్లు తెలుస్తుంది. ఇక ఇటీవల ఆస్ట్రేలియా టూర్ లో రోహిత్ సత్తా చాటిన సంగతి తెలిసిందే. ఆస్ట్రేలియా(Australia) తో జరిగిన మూడో వన్డేల్లో సెంచరీ, హాఫ్ సెంచరీతో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును రోహిత్ గెల్చుకున్నాడు. ఈ సిరీస్‌లో రోహిత్ ఫిట్‌గా కనిపించాడు.
ఇవి కూడా చదవండి
Priyank Panchal: నేపాల్ ప్రీమియర్ లీగ్ ఆడనున్న భారత స్టార్ క్రికెటర్
మరో రికార్డుపై కన్నేసిన కేఎల్ రాహుల్..!
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి