Dasoju Sravan: సీఎం రేవంత్‌పై దాసోజ్ శ్రవణ్ కీలక వ్యాఖ్యలు
ABN , Publish Date - Nov 13 , 2025 | 02:37 PM
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రేవంత్ ఆర్థిక అత్యాచారానికి పాల్పడ్డారంటూ వ్యాఖ్యలు చేశారు.
హైదరాబాద్, నవంబర్ 13: ఎన్ని అక్రమాలు చేసినా జూబ్లీహిల్స్‌లో ధర్మమే గెలుస్తుందని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ (MLC Dasoju Sravan) అన్నారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై (CM Revanth Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. బైపోల్స్‌లో ఎంఐఎం కూడా అక్రమాలకు పాల్పడి కాంగ్రెస్‌కు సహకరించిందని ఆరోపించారు. పోలీసులు బోగస్ ఓటింగ్‌కు సహకరించటం ప్రత్యక్షంగా చూశామన్నారు. కాగ్ రిపోర్ట్ సీఎం రేవంత్ రెడ్డి బట్టలు విప్పేసిందన్నారు. అప్పులు భారీగా తెచ్చిన రేవంత్.. ఆర్థిక అత్యాచారానికి పాల్పడ్డారంటూ వ్యాఖ్యలు చేశారు. అనుభవం లేని ముఖ్యమంత్రి ఉంటే.. ఇంతకంటే ఏం జరుగుతుందన్నారు. రేవంత్ రెడ్డి.. రియల్ ఎస్టేట్‌ను సర్వనాశనం చేశారని మండిపడ్డారు.
హైడ్రా పేరుతో ఆర్ఆర్ టాక్స్‌తో దోపిడీ జరుగుతుందని ఆరోపణలు గుప్పించారు. రెండేళ్ళల్లో రూ.3.48వేల కోట్ల అప్పులు తెచ్చారన్నారు. పార్టీ ఫిరాయింపుల విచారణ సందర్భంగా సందర్శకులు, మీడియాపై నిషేధం సరికాదని అన్నారు. ఇది అసెంబ్లీ స్పీకర్, ముఖ్యమంత్రి రేవంత్ సొంత వ్యవహారం కాదని చెప్పుకొచ్చారు. దొంగలు దొంగలు ఊర్లు పంచుకున్నట్లు ఉంది వ్యవహారం అంటూ కామెంట్స్ చేశారు. మాజీ ఎమ్మెల్యేలు , మాజీ ఎంపీలు మాజీ ఎమ్మెల్సీలకు ప్రవేశాన్ని నిషేధించడం ఏంటని ప్రశ్నించారు.
కేసు వాదిస్తున్న అడ్వకేట్లను సెల్ ఫోన్‌లు తీసుకురావద్దని హుకుం జారీ చేయటం సరికాదన్నారు. స్పీకర్ కార్యాలయం విడుదల చేసిన బులెటిన్ రాజ్యాంగ విరుద్ధమన్నారు. సుప్రీంకోర్టులో ఫుల్ బెంచ్ వాదనలు జరిగినప్పుడు కూడా సెల్ ఫోన్లు అనుమతిస్తారని తెలిపారు. తక్షణమే బులెటిన్ ఎత్తి వేయాలని స్పీకర్‌కు లేఖ రాసినట్లు చెప్పారు. ఫిరాయింపు విచారణను లైవ్ స్ట్రీమింగ్ ద్వారా ప్రజలు ప్రత్యక్ష్యంగా వీక్షించే అవకాశమివ్వాలని డిమాండ్ చేశారు. ఫిరాయింపు ఎమ్మెల్యేల వాదనల గురించి ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరముందని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ వ్యాఖ్యలు చేశారు.
ఇవి కూడా చదవండి...
భాగ్యనగరంలో హై అలర్ట్.. బస్టాండ్, రైల్వే స్టేషన్లలో విస్తృత సోదాలు
పెట్టుబడులతో ముందుకు రండి.. అంతా మాదే బాధ్యత: సీఎం చంద్రబాబు
Read Latest Telangana News And Telugu News