Share News

Jubilee Hills By-Election Counting: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల కౌంటింగ్‌పై జిల్లా ఎన్నికల అధికారి కీలక ప్రకటన

ABN , Publish Date - Nov 13 , 2025 | 02:32 PM

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక కౌంటింగ్‌కు సర్వం సిద్ధమైంది. నవంబర్ 14వ తేదీన ఉదయం 8 గంటలకే కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుందని జిల్లా ఎన్నికల అధికారి ఆర్ వి కర్ణన్ తెలిపారు.

Jubilee Hills By-Election Counting: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల కౌంటింగ్‌పై జిల్లా ఎన్నికల అధికారి కీలక ప్రకటన
Jubilee Hills By-Election Counting

హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో ఎవరు గెలవబోతున్నారనేది ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. ఈ నేపథ్యంలో ఎన్నికల కౌంటింగ్‌పై జిల్లా ఎన్నికల అధికారి ఆర్ వి కర్ణన్ కీలక విషయాలు వెల్లడించారు. నవంబర్ 14వ తేదీన ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమవుతుందన్నారు. మొదట పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ చేస్తామన్నారు. స్పెషల్ పర్మిషన్‌తో ఈ సారి 42 టేబుల్స్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కౌంటింగ్ ప్రక్రియను అబ్జర్వ్ చేయడానికి స్పెషల్ అధికారిని కూడా ఏర్పాటు చేశామన్నారు.


కౌంటింగ్ ప్రక్రియకు 186 మంది సిబ్బందిని నియమించినట్లు తెలిపారు. కౌంటింగ్‌ను ఎప్పటికప్పుడు RO పరిశీలిస్తారని.. LED స్క్రీన్ ద్వారా, EC యాప్ ద్వారా అప్డేట్ ఇస్తామని చెప్పారు. కౌంటింగ్ కేంద్రంలోకి అభ్యర్థులు, వారి ఏజెంట్లకు మాత్రమే అనుమతి ఉంటుందని, ఇతరులకు ప్రవేశం ఉండదని ఆర్ వి కర్ణన్ స్పష్టం చేశారు.


ఈ క్రమంలోనే జాయింట్ సీపీ తఫ్సీర్ ఇక్బాల్ మాట్లాడుతూ.. రేపు కౌంటింగ్ కోసం ప్రత్యేక భద్రత ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. అన్ని విభాగాల పోలీసు బృందాలు అందుబాటులో ఉంటాయని, రేపు కౌంటింగ్ కేంద్రం వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని పేర్కొన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.


Also Read:

ఏనుగుల సంచారం.. అధికారులకు డిప్యూటీ సీఎం కీలక ఆదేశాలు

20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యం: మంత్రి డోలా

For More Latest News

Updated Date - Nov 13 , 2025 | 02:47 PM