Share News

Priyank Panchal: నేపాల్‌ ప్రీమియర్‌ లీగ్‌ ఆడనున్న భారత స్టార్‌ క్రికెటర్‌

ABN , Publish Date - Nov 13 , 2025 | 02:36 PM

చిన్న దేశాలు నిర్వహించే క్రికెట్ లీగ్స్ లో స్టార్ క్రికెటర్లు కూడా పాల్గొంటారు. అలానే తాజాగా నేపాల్ ప్రీమియర్ లీగ్(NPL)లోకి భారత్ స్టార్ క్రికెటర్ ఎంట్రీ ఇస్తున్నాడు. ఇప్పటికే ఈ లీగ్‌లో టీమిండియా మాజీ డాషింగ్‌ ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ ఆడాడు. తాజాగా దేశవాలీ స్టార్‌ క్రికెటర్ అయిన ప్రియాంక్ పంచల్‌ కూడా ఎన్‌పీఎల్‌ లో ఆడేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు.

Priyank Panchal: నేపాల్‌ ప్రీమియర్‌ లీగ్‌ ఆడనున్న భారత స్టార్‌ క్రికెటర్‌
Priyank Panchal

అనేక దేశాలు క్రికెట్ ప్రీమియర్ లీగ్స్ నిర్వహిస్తుంటాయి. ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, భారత్ వంటి అనేక దేశాలు ఈ లీగ్స్ నిర్వహిస్తుంటారు. అంతేకాక చిన్న దేశాలు కూడా క్రికెట్ ప్రీమియర్ లీగ్స్ ను జరుపుతుంటాయి. ఈ చిన్న దేశాలు నిర్వహించే క్రికెట్ లీగ్స్ లో స్టార్ క్రికెటర్లు కూడా పాల్గొంటారు. అలానే తాజాగా నేపాల్ ప్రీమియర్ లీగ్(NPL)లోకి భారత్ స్టార్ క్రికెటర్ ఎంట్రీ ఇస్తున్నాడు. ఇప్పటికే ఈ లీగ్‌లో టీమిండియా మాజీ డాషింగ్‌ ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ (Shikhar Dhawan) ఆడాడు. తాజాగా దేశవాళీ స్టార్‌ క్రికెటర్ ప్రియాంక్ పంచల్‌ (Priyank Panchal) కూడా ఎన్‌పీఎల్‌ ఆడేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు.


త్వరలో నేపాల్ ప్రీమియర్ లీగ్ 2025 ఎడిషన్ ప్రారంభం కానుంది. ఈ లీగ్ కోసం ప్రియాంక్ పంచల్‌(Priyank Panchal).. కర్నాలి యాక్స్ ఫ్రాంచైజీతో చేతులు కలిపాడు. పంచల్‌ చేరికతో ఎన్‌పీఎల్‌లో విదేశీ క్రికెటర్ల సంఖ్య ఐదుకు చేరింది. ఇప్పటికే శిఖర్‌ ధావన్‌, జేమ్స్‌ వాట్‌, జేమ్స్‌ ఓడౌడ్‌ (నెదర్లాండ్స్‌), విలియం బాసిస్టో (ఆస్ట్రేలియా)లు నేపాల్ ప్రీమియర్ లీగ్ పాల్గొన్నారు. 35 ఏళ్ల ప్రియాంక్ పంచల్ గుజరాత్(Gujarat Cricketer) రాష్ట్రానికి చెందిన వాడు. ఇతడు దేశవాలీ క్రికెట్ లో అద్భుతంగా ఆడి సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకున్నాడు. 127 ఫ‌స్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో 45.18 స‌గ‌టు, 23 సెంచ‌రీల‌తో 8856 ప‌రుగులు సాధించాడు. అయినా అతనికి టీమిండియా జట్టుకు ప్రాతినిథ్యం వహించే ఛాన్స్ రాలేదు. భారత సెలెక్టర్ల నుంచి పిలుపు కోసం చాలా కాలం ఎదురుచూసి.. చివరకు ఇటీవలే రిటైర్మెంట్‌ ప్రకటించాడు.


తాజాగా జరిగిన హాంగ్‌కాంగ్‌ సిక్సస్‌ టోర్నీలో పంచల్‌(Priyank Panchal,) భారత జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. రంజీ ట్రోఫీలో పంచల్‌కు 2016-17 డ్రీమ్ సీజన్‌. ఆ సీజన్‌లో అతను ట్రిపుల్‌ సెంచరీ సాయంతో 1310 పరుగులు చేసి.. అందర్ని ఆకట్టుకున్నాడు. కాగా, ప్రస్తుతం పంచల్‌ ఒప్పందం చేసుకున్న కర్నాలి యాక్స్ ఫ్రాంచైజీకే శిఖర్‌ ధవన్‌ గత నేపాల్‌ ప్రీమియర్‌ లీగ్‌ సీజన్‌లో ఆడాడు. యాక్స్‌ తరఫున మార్కీ ప్లేయర్‌గా ధావన్(Shikhar Dhawan) ఎంట్రీ ఇచ్చాడు. అంతేకాక ఆ సీజన్‌లో ఓ మెరుపు అర్ద శతకం బాది ఆకట్టుకున్నాడు. అయితే ఈ సీజన్‌కు ధావన్‌ అందుబాటులో ఉంటాడా లేదా అన్నదానిపై స్పష్టత లేదు. మొత్తంగా నేపాల్ ప్రీమియర్ లీగ్ 2025 ఎడిసన్ లో ప్రియాంక్ పంచల్ఎలా రాణిస్తాడో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.



ఇవి కూడా చదవండి

అలా బతకడం చాలా కష్టం: సానియా మీర్జా

మరో రికార్డుపై కన్నేసిన కేఎల్ రాహుల్..!

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Nov 13 , 2025 | 02:37 PM