Woman Smashes Husbands Car: భార్యకు కోపం వస్తే ఇలానే ఉంటుంది.. భర్త ఇది అస్సలు ఊహించలేదు..
ABN , Publish Date - Nov 13 , 2025 | 02:12 PM
ఇంటి ఖర్చులకు డబ్బులు ఇవ్వలేదన్న కోపంతో ఓ భార్య ఆగ్రహానికి గురైంది. భర్త కారును సుత్తెతో ధ్వంసం చేసింది. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్‌లో చోటుచేసుకుంది.
భార్యాభర్తల మధ్య గొడవలు సహజం. అయితే, కొన్నిసార్లు ఇంటి ఖర్చుల విషయంలోనూ భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతూ ఉంటాయి. ఇంటి బాధ్యతల్ని చూసుకునే భార్యలకు ఓ పెద్ద సమస్య ఏంటంటే.. భర్తలు ఇంటి ఖర్చుల కోసం డబ్బులు ఇవ్వక పోవటం. ఈ విషయంలోనే చాలా జంటలు గొడవలు పడుతూ ఉంటాయి. తాజాగా, ఓ భార్య పాకెట్ మనీ ఇవ్వలేదన్న కోపంతో తీవ్ర ఆగ్రహానికి గురైంది. భర్త కారును ధ్వంసం చేసి పడేసింది. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్‌లో చోటుచేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. బిజ్‌నోర్ జిల్లా, నాజిబాబాద్ పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన ధర్మేంద్రకు అదే ప్రాంతానికి చెందిన హిమానితో కొన్నేళ్ల క్రితం పెళ్లైంది. ధర్మేంద్ర ఉద్యోగం చేస్తుండగా.. హిమాని ఇంటి బాధ్యతలు చూసుకుంటోంది. కొద్దిరోజుల క్రితం హిమాని తన భర్తను పాకెట్ మనీ కోసం డబ్బులు ఇవ్వమని అడిగింది. ఇందుకు ధర్మేంద్ర నో చెప్పాడు. కారు పాడైందని, దాన్ని బాగు చేయించడానికి డబ్బులు వాడతానని చెప్పాడు. దీంతో భార్య ఆగ్రహానికి గురైంది.
సుత్తెతో కారు అద్దాలను ధ్వంసం చేసింది. ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో కారు అద్దాలు ధ్వంసం అయిన దృశ్యాలు ఉన్నాయి. కొంతమంది ఆ కారును తమ ఫోన్లలో వీడియో తీస్తూ ఉన్నారు. ఇక, ఆ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు.. భార్యకు కోపం వస్తే ఇలానే ఉంటుంది అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి
తుంగభద్ర డ్యామ్‌కు పటిష్ట భద్రత..
దేవుడికి నా మీద దయ ఎక్కువ: పంత్