Home » Cricket World Cup
టీమిండియా స్టార్ స్పిన్నర్ కుల్‌దీప్ యాదవ్ త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్నాడు. తన చిన్ననాటి స్నేహితురాలు వన్షికతో మార్చి 14న ఉత్తరాఖండ్‌లోని ముస్సోరి రిసార్ట్‌లో కుల్‌దీప్ వివాహం జరగనుంది.
టీమిండియా యువ పేసర్ అర్ష్‌దీప్ సింగ్‌పై ఐసీసీ క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘనకు పాల్పడినందకు ఆయన మ్యాచ్ ఫీజులో 15శాతం జరిమానా విధించింది.
టీ20 ప్రపంచ కప్ 2026 విజేతగా టీమిండియా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ ఫైనల్ మ్యాచ్‌కు మాజీ కెప్టెన్లు రోహిత్ శర్మ, ఎంఎస్ ధోనీ కూడా హాజరయ్యారు. అయితే స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ కనిపించకపోవడంతో అభిమానుల్లో చర్చ మొదలైంది.
టీ20 ప్రపంచ కప్ 2026 ఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై టీమిండియా 96 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. వరుసగా రెండో సారి పొట్టి ప్రపంచ కప్‌ను ముద్దాడింది. జట్టు గెలుపులో అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ హాఫ్ సెంచరీలు చేసి కీలక పాత్ర పోషించారు.
టీ20 ప్రపంచ కప్ 2026.. టీమిండియా సగర్వంగా కప్పును ముద్దాడింది. ఎక్కడ చూసినా భారత జట్టు సంబరాలు, అభిమానుల కేరింతలు, ప్రముఖుల అభినందనలు! మరి రన్నరప్‌గా నిలిచిన ‘న్యూజిలాండ్’ గురించి మాట వరుసకు కూడా ఎవ్వరూ ప్రస్తావించడం లేదు.
టీ20 ప్రపంచ కప్ 2026ని టీమిండియా ముద్దాడటంలో మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తిది కీలక పాత్ర. ప్రస్తుతం వరుణ్ చక్రవర్తి సోషల్ మీడియాలో పెట్టిన ‘టీ కప్’ ఫొటో తెగ వైరల్ అవుతోంది. అభిమానులను నవ్వుల్లో ముంచెత్తుతోంది. ఇంతకీ వరుణ్ చేసిన ట్రోల్ ఏమిటంటే..
టీ20 ప్రపంచ కప్‌ను టీమిండియా వరుసగా రెండోసారి ముద్దాడింది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ క్రికెట్ దిగ్గజం షోయబ్ అక్తర్ భారత క్రికెట్ వ్యవస్థను ప్రత్యేకంగా కొనియాడాడు. రోహిత్, విరాట్ వంటి దిగ్గజాలు లేకుండా యువ ప్లేయర్లకు అవకాశం ఇవ్వడంపై ఆయన స్పందించాడు.
టీ20 ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ మధ్యలో జరిగిన ఓ గొడవ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. టీమిండియా యువ పేసర్ అర్ష్‌దీప్ సింగ్.. ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే న్యూజిలాండ్ స్టార్ బ్యాటర్ డారిల్ మిచెల్‌తో గొడవపడ్డాడు.
టీమిండియా చేసిన అద్భుతాన్ని ప్రతి అభిమాని మనసారా ఆస్వాదిస్తున్నాడు. వరుసగా రెండో సారి, మొత్తంగా ముచ్చటగా మూడోసారి మన భారత జట్టు పొట్టి ప్రపంచ కప్‌ను సగర్వంగా ముద్దాడింది. ఈ నేపథ్యంలో టీమిండియా ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ ఎక్స్ వేదికగా తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు.
టీ20 ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్‌కు ముందు స్టార్ బ్యాటర్ ఇషాన్ కిషన్ కజిన్ సిస్టర్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఈ బాధను దిగమింగుకుని ఇషాన్.. ఫైనల్‌లో అద్భుత ప్రదర్శన చేశాడు. ఈ విజయాన్ని తన సోదరికి అంకితం ఇస్తున్నట్లు చెప్పాడు.