Share News

CM Chandrababu: రెండు కీలక ఒప్పందాలు కుదర్చుకోనున్న సర్కార్.. చంద్రబాబు ట్వీట్

ABN , Publish Date - Nov 13 , 2025 | 03:00 PM

విశాఖపట్నం సీఐఐ పార్టనర్ షిప్ కంటే ముందే పలు కంపెనీలతో రాష్ట్ర ప్రభుత్వం కీలక ఒప్పందాలు చేసుకుంటోంది. ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు సోషల్ మీడియా ఎక్స్‌ వేదికగా తెలియజేశారు.

CM Chandrababu: రెండు కీలక ఒప్పందాలు కుదర్చుకోనున్న సర్కార్.. చంద్రబాబు ట్వీట్
CM Chandrababu

విశాఖపట్నం, నవంబర్ 13: విశాఖలో రేపు, ఎల్లుండి సీఐఐ భాగస్వామ్య సదస్సు జరుగనుండగా... ఇందు కోసం ప్రభుత్వ యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ సదస్సును రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) ఇప్పటికే విశాఖకు చేరుకుని పలు కంపెనీల ప్రతినిధులతో చర్చలు జరుపుతున్నారు. సీఐఐ సదస్సుకు ముందే వివిధ కంపెనీలతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందాలను కుదుర్చుకుంటోంది. ఈ ఒప్పందాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సామాజిక మాధ్యమం ఎక్స్‌ వేదికగా స్పందించారు.


విశాఖపట్నం సీఐఐ పార్టనర్ షిప్ కన్నా ముందే సమ్మిట్‌లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తైవాన్ కంపెనీలతో రెండు కీలక అవగాహన ఒప్పందాలు కుదుర్చుకోనుందని సీఎం తెలిపారు. ఈ ఒప్పందాల ద్వారా రాష్ట్ర పారిశ్రామికవృద్ధి మరింత అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 400 కోట్ల రూపాయిలతో కుప్పంలో 470 ఎకరాల్లో పరిశ్రమ ఏర్పాటు చేస్తుందని.. దీని వలన 50 వేల ప్రత్యక్షంగా ఉద్యోగాలు రానున్నాయని తెలిపారు.

chand-cii1.jpg


మిజోలి ఇండియా జెవి, మిజోలి యూఎస్ఏ, క్రియేటివ్ సెన్సోర్ (తైవాన్), సినేస్టి టెక్నాలజీలు 23 జిడబ్ల్యూహెచ్ ఫ్రికర్సర్ ఫ్రి సింగిల్ క్రిస్టర్ క్యాతోడ్ యాక్టివ్ మెటీరియల్, సాలిడ్ స్టేట్ ఎలక్ట్రోలైట్ మ్యానిఫ్యాక్చరింగ్ ఫేసిలిటిని ఓర్వకల్లు, కర్నూలులో రూ.18 వేల కోట్లతో ఏర్పాటు చేయనుంది. వీటివల్ల 2 వేల ప్రత్యక్ష ఉద్యోగాలు రానున్నాయన్నారు. ఈ అవగాహన ఒప్పందాలు స్వర్ణాంధ్రా విజన్ 2047 సాధించడంలో కీలక భూమిక పోషిస్తాయని... వికాసిత్ భారత్ వైపు నడిపిస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ట్వీట్ చేశారు.


ఇవి కూడా చదవండి...

20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యం: మంత్రి డోలా

ఏనుగుల సంచారం.. అధికారులకు డిప్యూటీ సీఎం కీలక ఆదేశాలు

Read Latest AP News And Telugu News

Updated Date - Nov 13 , 2025 | 03:48 PM