Share News

Minister Dola Veeranjaneya Swamy: 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యం: మంత్రి డోలా

ABN , Publish Date - Nov 13 , 2025 | 01:14 PM

యువతకు 20 లక్షల ఉద్యోగాల కల్పనే కూటమి ప్రభుత్వ లక్ష్యమని మంత్రి డోలా శ్రీ వీరాంజనేయ స్వామి స్పష్టం చేశారు. యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించడం కోసం సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ శ్రమిస్తున్నారన్నారు.

Minister Dola Veeranjaneya Swamy: 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యం: మంత్రి డోలా
Minister Dola Veeranjaneya Swamy

విశాఖపట్నం, నవంబర్ 13: విశాఖ సీఐఐ సదస్సుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి (Minister Dola Veeranjaneya Swamy) తెలిపారు. గురువారం ఏబీఎన్ - ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ.. గత 5 ఏళ్ళ వైసీపీ అరాచక పాలనతో రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిందన్నారు. కూటమి పాలనతో రాష్ట్ర అభివృద్ధిలో నూతన అధ్యాయం మొదలైందని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజనరీ నాయకత్వంపై నమ్మకంతో రాష్ట్రానికి పరిశ్రమలు, పెట్టుబడులు వస్తున్నాయని చెప్పారు. ఊహించినదానికంటే ఎక్కువగా పెట్టుబడులు వస్తున్నాయన్నారు.


రాష్ట్ర యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్న లక్ష్యంతో సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ అహర్నిశలు శ్రమిస్తున్నారని తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన 17 నెలల్లోనే చంద్రబాబు, లోకేష్ కృషితో ఇప్పటి వరకు రూ.9.5 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు.. ప్రభుత్వం పట్ల ప్రజల్లో, పెట్టుబడిదారుల్లో ఒక నమ్మకం, విశ్వాసం కలిగించారన్నారు. రాష్ట్ర యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. గూగుల్ సంస్థ దేశంలోనే తొలిసారి డేటా సెంటర్ విశాఖలో ఏర్పాటు చేస్తున్నారంటే ఇది రాష్ట్రానికి గర్వకారణమని అన్నారు. లోకేష్ శ్రమకు ఫలితంగా, విశాఖలో గూగుల్ 15 బిలియన్ డాలర్ల (రూ.1.33 లక్షల కోట్లు) పెట్టుబడులు పెట్టబోతోందన్నారు. రాష్ట్రానికి పెట్టుబడుల సాధనలో మంత్రి లోకేష్ ది కీలక పాత్ర అని మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి వెల్లడించారు.


వారికి ఏపీ గమ్యస్థానం: మంత్రి అనగాని

anagani.jpg

రేపు, ఎల్లుండి జరగబోయే సీసీఐ పార్టనర్షిప్ సమ్మిట్ రాష్ట్ర రూపురేఖలు మార్చనుందని మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. రాష్ట్ర జీడీపీని పెంచడంలో దోహదం చేస్తుందన్నారు. వేగంగా బిజినెస్ చేయాలనుకునే వారు ఏపీని గమ్యస్థానంగా ఎంచుకుంటున్నారు. పెట్టుబడులన్నీ గ్రౌండ్ అయ్యే విధంగా కాలానుగుణ కార్యాచరణ కూడా చేపడతామని చెప్పారు. ఉద్యోగాల కల్పనకు పరిశ్రమలకు భూములిస్తుంటే వైసీపీ దుర్మార్గపు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. వారి హయాంలో అన్ని భూ కబ్జాలు.. భూ దోపిడీలే అంటూ వ్యాఖ్యలు చేశారు. అందుకే అప్పుడు పారిపోయిన కంపెనీలు తిరిగి ఇప్పుడు వస్తున్నాయని మంత్రి అనగాని సత్యప్రసాద్ పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి...

ఐదేళ్ల తర్వాత ఏపీకి రీన్యూ పవర్.. ఎక్స్‌లో లోకేష్ ట్వీట్

విశాఖ ఎకనామిక్ రీజియన్ అభివృద్ధిపై సదస్సు.. హాజరుకానున్న నారాయణ

Read Latest AP News And Telugu News

Updated Date - Nov 13 , 2025 | 01:20 PM