Share News

Virat Kohli: కాళ్లు మొక్కిన కోహ్లీ.. ఆయన బ్యాగ్రౌండ్ ఇదే

ABN , Publish Date - Jan 31 , 2025 | 06:44 PM

Ranji Trophy 2025: టీమిండియా టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అంటే పడిచచ్చే అభిమానులు కోట్లలో ఉన్నారు. అతడి బ్యాటింగ్ టాలెంట్‌కు ముగ్ధులు అవ్వని వారుండరు అంటే అతిశయోక్తి కాదు. కోహ్లీతో సెల్ఫీ దిగేందుకు ఫ్యాన్స్ పోటీపడుతుంటారు. కొందరు వీరాభిమానులైతే అతడి కాళ్లు కూడా పట్టుకోవడం చూస్తున్నాం.

Virat Kohli: కాళ్లు మొక్కిన కోహ్లీ.. ఆయన బ్యాగ్రౌండ్ ఇదే
Virat Kohli

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఓ పెద్దాయన కాళ్లు మొక్కడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా అభిమానులు కోహ్లీ కాళ్లు మొక్కేందుకు ఎగబడటం చూస్తుంటాం. అతడితో సెల్ఫీలు దిగేందుకు, ఆటోగ్రాఫ్‌లు తీసుకునేందుకు పోటీపడతారు. కొందరు వీరాభిమానులైతే అమాంతం గ్రౌండ్‌లోకి దూసుకొచ్చి కింగ్ కాళ్ల మీద పడిపోతారు. అలాంటిది కోహ్లీ ఇంకొకరి కాళ్లు మొక్కడం ఏంటని అంతా డిస్కస్ చేస్తున్నారు. మరి.. విరాట్ ఎందుకిలా చేశాడో ఇప్పుడు చూద్దాం..


పాదాలకు నమస్కరించి..!

కోహ్లీ ఎదుగుదలలో కీలకపాత్ర పోషించాడు అతడి చిన్ననాటి కోచ్ రాజ్‌కుమార్ శర్మ. అందుకే ఇవాళ ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్ నిర్వహించిన కార్యక్రమంలో రాజ్‌కుమార్‌ పాదాలకు నమస్కరించి ఆశీస్సులు తీసుకున్నాడు విరాట్. 100కు పైగా టెస్టులు ఆడినందుకు విరాట్‌ను ఢిల్లీ క్రికెట్ సంఘం సన్మానించింది. శాలువా కప్పి జ్ఞాపికను అందజేసింది. వీటిని అందుకున్న తర్వాత కోచ్ రాజ్‌కుమార్‌కు నమస్కారం పెట్టాడు కోహ్లీ. దీనికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.


విరాట్.. నీకు సెల్యూట్!

విరాట్ ఫొటోలు చూసిన నెటిజన్స్.. అతడి సంస్కారానికి సెల్యూట్ చేస్తున్నారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే దానికి విరాట్ ఎగ్జాంపుల్ అని అంటున్నారు. కోచ్‌కు అతడు ఇచ్చిన రెస్పెక్ట్ హైలైట్ అని మెచ్చుకుంటున్నారు. కాగా, కోచ్ రాజ్‌కుమార్ శర్మే విరాట్‌కు క్రికెట్‌లో ఓనమాలు దిద్దారు. ఆయన దగ్గరే కోహ్లీ బ్యాటింగ్ పాఠాలు నేర్చుకున్నాడు. అక్కడి నుంచి క్రమంగా ఢిల్లీ జట్టుకు ఆడటం, అలా భారత జట్టులోకి ఎంట్రీ ఇవ్వడం జరిగిపోయాయి. కాలం గిర్రున తిరిగింది. 2010లో టీమిండియాలోకి వచ్చిన కోహ్లీ 15 ఏళ్లలో మోడర్న్ మాస్టర్‌గా ఎదిగాడు. ఎనలేని క్రేజ్, సంపాదన, అశేష గుర్తింపు సంపాదించాడు. అయినా తన కోచ్‌కు, ఇక్కడి దాకా రావడంలో అండగా నిలిచిన ఢిల్లీ బోర్డును అతడు మర్చిపోకపోవడం గమనార్హం.


ఇవీ చదవండి:

భార్య మాటలకు అశ్విన్ షాక్.. అతడ్ని ప్రేమిస్తున్నావా అని అడగడంతో..

సచిన్‌కు ప్రతిష్టాత్మక పురస్కారం.. ఈ అవార్డు చాలా స్పెషల్

ఒకే రోజు ముగ్గురు స్టార్ల సెంచరీలు మిస్.. ఇది ఊహించలేదు

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jan 31 , 2025 | 06:44 PM