Virat Kohli: నా టార్గెట్ ఒక్కటే.. మిగతావి అస్సలు పట్టించుకోను: కోహ్లీ
ABN , Publish Date - Mar 02 , 2025 | 02:16 PM
Champions Trophy 2025: టీమిండియా టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఫుల్ స్వింగ్‌లో ఉన్నాడు. కొన్నాళ్లుగా ఫామ్‌లేమితో ఇబ్బందులు పడ్డ కింగ్.. దాయాది పాకిస్థాన్ మీద సెంచరీ బాది స్ట్రాంగ్‌గా కమ్‌బ్యాక్ ఇచ్చాడు.

ఫామ్ విషయంలో భారీగా విమర్శలకు గురైన టీమిండియా టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఎట్టకేలకు గాడిన పడ్డాడు. కీలక మ్యాచుల్లో తాను ఎంత ముఖ్యమైన ఆటగాడో అతడు ప్రూవ్ చేశాడు. చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో సెంచరీతో ఆకట్టుకున్నాడు కింగ్. మెగా టోర్నమెంట్‌లో మున్ముందు సెమీస్, ఫైనల్స్ లాంటి బడా మ్యాచులు ఉన్న నేపథ్యంలో విరాట్ ఫామ్‌ను అందుకోవడం భారత్‌కు ఎక్కడలేని ఎనర్జీని ఇస్తోంది. సాధారణంగా ప్రత్యర్థులను వణికించే టాప్ బ్యాటర్.. ఇక ఫుల్ ఫామ్‌ను అందుకుంటే వారికి చుక్కలే. ఇది టీమ్‌కు తిరుగులేని ఆయుధంగా మారనుంది.
ఒత్తిడికి దూరం
న్యూజిలాండ్‌తో మ్యాచ్‌కు సన్నద్ధమవుతున్న కోహ్లీ క్రికెట్‌ను తాను ఎలా చూస్తాడో తాజాగా షేర్ చేశాడు. ఆటను చూసే విధానం, బ్యాటింగ్ చేసే తీరు గురించి అతడు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. ఢిల్లీలో పుట్టి పెరిగినందున తాను ఎప్పుడూ జాలీగా ఉంటానన్నాడు విరాట్. ఏ విషయమైనా అనవసర ఒత్తిడి పడకుండా కూల్‌గా ఉండేందుకు ప్రయత్నిస్తానని తెలిపాడు. ఒక్కసారి బరిలోకి దిగితే గేమ్ గురించి తప్ప ఇతర అంశాలేవీ పట్టించుకోనన్నాడు. కోహ్లీ వ్యాఖ్యలతో భారత హెడ్ కోచ్ గౌతం గంభీర్ కూడా ఏకీభవించాడు.
దాని పైనే ఫోకస్
ఢిల్లీ స్ఫూర్తి తమలో ఎప్పుడూ ఉంటుందని, అదే ముందుకు నడిపిస్తుందన్నాడు గంభీర్. క్రికెట్ ఫీల్డ్‌లోకి అడుగుపెట్టిన ప్రతిసారి గెలవడం మీదే ఫోకస్ చేస్తామని.. ఏ నెగెటివ్ అంశాన్ని కూడా దరిదాపుల్లోకి రానివ్వమన్నాడు. చాంపియన్స్ ట్రోఫీ నేపథ్యంలో ఐసీసీ నిర్వహించిన చిట్‌చాట్‌లో పాల్గొన్న గంభీర్-కోహ్లీ పైవ్యాఖ్యలు చేశారు. కాగా, మెగా టోర్నీలో వరుసగా రెండు మ్యాచుల్లో గెలిచి సెమీస్‌కు చేరుకున్న భారత్.. నాకౌట్‌లో ఆస్ట్రేలియా-సౌతాఫ్రికాలో ఒకరితో పోటీపడనుంది. ఇవాళ న్యూజిలాండ్‌తో జరిగే ఫైట్‌లో గెలుపోటములను బట్టి సెమీస్ ప్రత్యర్థి ఎవరనేది డిసైడ్ అవుతుంది.
ఇవీ చదవండి:
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి