Ranji Trophy 2025: రంజీ ట్రోఫీలో కొత్త చాంపియన్.. 7 ఏళ్లలో మూడో టైటిల్
ABN , Publish Date - Mar 02 , 2025 | 03:29 PM
Vidarbha: రంజీ ట్రోఫీలో కొత్త చాంపియన్ అవతరించింది. ఆ టీమ్ 7 ఏళ్ల గ్యాప్‌లో 3 సార్లు విజేతగా నిలిచి రికార్డు సృష్టించింది. మరి.. ఆ జట్టు ఏదనేది ఇప్పుడు చూద్దాం..

రంజీ ట్రోఫీ 2024-25 సీజన్ ముగిసింది. ఈసారి విదర్భ జట్టు విజేతగా ఆవిర్భవించింది. కేరళతో జరిగిన ఫైనల్ మ్యాచ్ డ్రాగా ముగియగా.. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో ఆధిక్యంలో ఉండటంతో విదర్భను విజేతగా ప్రకటించారు. తొలి ఇన్నింగ్స్‌లో 153 పరుగులు, సెకండ్ ఇన్నింగ్స్‌లో 73 పరుగులతో అదరగొట్టిన విదర్భ బ్యాటర్ దానిష్ మలేవాల్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డుకు ఎంపికయ్యాడు. టోర్నమెంట్‌లో 476 పరుగులు చేయడమే గాక.. 69 వికెట్లు పడగొట్టిన హర్ష్ దూబె ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌కు సెలెక్ట్ అయ్యాడు. రంజీ ట్రోఫీలో గత 7 ఏళ్ల వ్యవధిలో విదర్భ జట్టు చాంపియన్‌గా నిలవడం ఇది మూడోసారి కావడం విశేషం.
కష్టానికి తగిన ఫలితం
ఫైనల్ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో విదర్భ 379 పరులకు ఆలౌట్ అయింది. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన కేరళ 342 పరుగులు చేసింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన విదర్భ 9 వికెట్లకు 375 పరుగులు చేసింది. సెకండ్ ఇన్నింగ్స్‌లో స్టార్ బ్యాటర్ కరుణ్ నాయర్ (135) భారీ శతకంతో మెరవడం విశేషం. అతడికి ఈ సీజన్‌లో ఇది 9వ సెంచరీ కావడం మరో స్పెషాలిటీ. మొత్తంగా సీజన్‌లో అటు బ్యాటర్లు, ఇటు బౌలర్లు సమష్టిగా రాణించడం, ఫైనల్‌లోనూ అదే కంటిన్యూ చేయడంతో మరోసారి చాంపియన్‌గా ఆవిర్భవించింది విదర్భ. ఇంత తక్కువ గ్యాప్‌లో మూడుసార్లు విజేతగా నిలవడం అంటే మాటలు కాదు. ముంబై లాంటి టాప్ టీమ్స్‌కు ఆ జట్టు సవాల్ విసరడం రంజీ ట్రోఫీలో పెరుగుతున్న ప్రమాణాలకు ఉదాహరణ అని చెప్పొచ్చు.
ఇవీ చదవండి:
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి