Share News

Tilak-Varun: పరువు కాపాడిన తిలక్-వరుణ్.. సీనియర్లను నమ్ముకుంటే అంతే సంగతులు

ABN , Publish Date - Jan 29 , 2025 | 05:13 PM

ICC Rankings: యంగ్ గన్ తిలక్ వర్మ, మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి టీమిండియా పరువు కాపాడారు. భారత్‌కు తాము ఉన్నామని ప్రూవ్ చేశారు. వీళ్లిద్దరూ ఇలాగే రాణిస్తూ పోతే మెన్ ఇన్ బ్లూకు ఎదురుండదు.

Tilak-Varun: పరువు కాపాడిన తిలక్-వరుణ్.. సీనియర్లను నమ్ముకుంటే అంతే సంగతులు
Team India

ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్‌కు సంబంధించిన ఏ విషయమైనా భారత్ హవా మామూలుగా ఉండదు. ఐసీసీ టీమ్స్ గానీ అవార్డులు గానీ ర్యాంకింగ్స్ గానీ ఎందులోనైనా టీమిండియా రుబాబు చూపిస్తూ ఉంటుంది. సచిన్ టెండూల్కర్ ఎరా నుంచి విరాట్ కోహ్లీ జమానా వరకు ఇది చూస్తూనే ఉన్నాం. అయితే గత కొన్ని నెలలుగా ఐసీసీ ర్యాంకింగ్స్‌లో భారత్ ప్రభావం తగ్గిపోతూ వస్తోంది. సీనియర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఒక ఫార్మాట్ నుంచి తప్పుకోవడం.. మిగిలిన రెండు ఫార్మాట్లలో విఫలమవుతుండటంతో మన టీమ్‌ ర్యాంకింగ్స్‌లో వెనుకబడుతోంది. అయితే టెన్షన్ అక్కర్లేదంటూ మెరుపులా దూసుకొచ్చారు యువ ఆటగాళ్లు. వాళ్లు ఎవరో ఇప్పుడు చూద్దాం..


దూసుకొచ్చిన వరుణ్!

ఐసీసీ తాజాగా ప్రకటించిన టీ20 ర్యాంకింగ్స్‌లో భారత్ సత్తా చాటింది. మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ఏకంగా 25 స్థానాలు మెరుగుపర్చుకొని 5వ స్థానంలో నిలిచాడు. ఇంగ్లండ్‌తో మూడో టీ20లో 24 రన్స్ ఇచ్చి 5 వికెట్లు పడగొట్టడం అతడికి ప్లస్ అయింది. తాజా టీ20 బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో ఇంగ్లీష్ స్పిన్నర్ ఆదిల్ రషీద్ (718 పాయింట్లు) టాప్‌లో నిలిచాడు. అతడి తర్వాతి స్థానాల్లో వరుసగా వెస్టిండీస్ స్పిన్నర్ అకీల్ హొస్సేన్ (707 పాయింట్లు), శ్రీలంక స్టార్ వనిందు హసరంగ (698 పాయింట్లు), కంగారూ స్పిన్నర్ ఆడమ్ జంపా (694 పాయింట్లు), వరుణ్ చక్రవర్తి (679 పాయింట్లు) నిలిచారు. టాప్-5లో నిలవడం వరుణ్‌కు ఇదే ఫస్ట్ టైమ్. తద్వారా కెరీర్ బెస్ట్ ర్యాంక్‌ను అతడు నమోదు చేసినట్లయింది.


తిలక్ హవా!

ఇంగ్లండ్ స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్ బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో 13 స్థానాలు ఎగబాకి ఆరో ర్యాంకు సాధించాడు. టాప్-5లో మాత్రం మొత్తం స్పిన్నర్లే ఉండటం గమనార్హం. ఇక, టీ20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో ఆస్ట్రేలియా ఓపెనర్ ట్రావిస్ హెడ్ ఫస్ట్ ప్లేస్‌లో ఉన్నాడు. హైదరాబాదీ తిలక్ వర్మ ఒక స్థానం మెరుగుపర్చుకున్నాడు. ఫిల్ సాల్ట్‌ను వెనక్కి నెట్టి అతడు ఏకంగా 2వ ర్యాంక్‌లో నిలిచాడు. సూర్యకుమార్ యాదవ్, జోస్ బట్లర్ నాలుగు, ఐదు స్థానాల్లో కొనసాగుతున్నారు. ర్యాంకింగ్స్‌లో అటు బ్యాటింగ్‌లో తిలక్.. ఇటు బౌలింగ్‌లో వరుణ్ సత్తా చాటడంతో సీనియర్లను నమ్ముకుంటే లాభం లేదని.. ఇక యంగ్‌స్టర్స్‌ మీద భారం పెట్టాలనే అభిప్రాయాలు సోషల్ మీడియాలో వ్యక్తం అవుతున్నాయి.


ఇవీ చదవండి:

సంజూ కెరీర్ ఫినిష్.. ఒక్క షాట్ ఎంత పని చేసింది

అతడి వల్లే ఓడాం.. ఇది అస్సలు మర్చిపోను: సూర్య

టీమిండియాకు కొత్త కెప్టెన్.. చేజేతులా చేసుకున్న సూర్య

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jan 29 , 2025 | 05:20 PM