Share News

Siddharth Desai: ఒకే ఇన్నింగ్స్‌లో 9 వికెట్లు.. రంజీ ట్రోఫీలో సంచలనం

ABN , Publish Date - Jan 23 , 2025 | 07:04 PM

Ranji Trophy: ఒక ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు తీస్తే మెచ్చుకుంటారు. ఇంకో రెండు వికెట్లు ఎక్కువ తీస్తే గ్రేట్ అంటూ ప్రశంసల్లో ముంచెత్తుతారు. అలాంటిది ఓ బౌలర్ ఏకంగా సింగిల్ ఇన్నింగ్స్‌లో 9 వికెట్లు తీసి రంజీ ట్రోఫీలో సంచలనం సృష్టించాడు.

Siddharth Desai: ఒకే ఇన్నింగ్స్‌లో 9 వికెట్లు.. రంజీ ట్రోఫీలో సంచలనం
Siddharth Desai

టెస్టులు, ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో వికెట్లు తీయడం అంత ఈజీ కాదు. లాంగ్ ఫార్మాట్‌లో సుదీర్ఘ స్పెల్స్ వేసినా ఒక్కోసారి వికెట్లు రావు. కొందరు జిడ్డు బ్యాటర్లు బౌలర్లకు వికెట్లు ఇవ్వకుండా హింసిస్తారు. సాలిడ్ డిఫెన్స్‌తో అడ్డుపడతారు. సేమ్ టైమ్ పిచ్ నుంచి కూడా సపోర్ట్ దొరకదు. అయితే కొందరు బౌలర్లు మాత్రం బ్యాటర్, వికెట్, కండీషన్స్ లాంటివి పట్టించుకోకుండా తమదైన శైలిలో దూకుడుగా బౌలింగ్ చేస్తూ వికెట్ల పండుగ చేసుకుంటారు. నీళ్లు తాగినంత ఈజీగా 5 వికెట్ హాల్స్ తీస్తుంటారు. ఇంకొందరు ఆరేడు మందిని కూడా ఔట్ చేస్తారు. అయితే ఓ బౌలర్ మాత్రం సింగిల్ ఇన్నింగ్స్‌లో ఏకంగా 9 మంది బ్యాటర్లను పెవిలియన్‌కు పంపి సంచలనం సృష్టించాడు. అతడు ఎవరో ఇప్పుడు చూద్దాం..


క్రేజీ రికార్డు!

రంజీ ట్రోఫీలో సంచలనం నమోదైంది. గుజరాత్ స్పిన్నర్ సిద్ధార్థ్ దేశాయ్ స్టన్నింగ్ బౌలింగ్‌తో మైండ్ బ్లాంక్ చేశాడు. ఏకంగా 9 వికెట్లు తీసి వారెవ్వా అనిపించాడు. ఉత్తరాఖండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో 15 ఓవర్లు వేసిన దేశాయ్.. 36 పరుగులు ఇచ్చి 9 మంది ప్రత్యర్థి బ్యాటర్లను పెవిలియన్‌కు దారి చూపించాడు. అతడి దెబ్బకు అపోజిషన్ టీమ్ 30 ఓవర్లలో 111 పరుగులకే కుప్పకూలింది. క్లాసికల్ ఆఫ్ స్పిన్ డెలివరీస్‌తో బ్యాటర్లకు పోయించాడు దేశాయ్. క్లీన్‌బౌల్డ్‌లు, ఎల్డీడబ్ల్యూలు చేస్తూ వచ్చిన బ్యాటర్‌ను వచ్చినట్లు డ్రెస్సింగ్ రూమ్‌కు పంపించాడు. ఈ క్రమంలో గుజరాత్ తరఫున బెస్ట్ బౌలింగ్ ఫిగర్స్ నమోదు చేసిన వినూభాయ్ ధృవ్ (8/31)ను అధిగమించి టాప్‌లో నిలిచాడు. అతడి బౌలింగ్ చూసిన అభిమానులు ఇలాంటోడు నేషనల్ టీమ్‌కు ఎంపికైతే బాగుంటుందని కామెంట్స్ చేస్తున్నారు.


ఇవీ చదవండి:

సారీ చెప్పిన అర్ష్‌దీప్.. మ్యాటర్ ఏంటో తెలిస్తే నవ్వాగదు

కోహ్లీని భయపెడుతున్న సూర్య.. అనుకున్నదే అవుతోంది

వచ్చాడు.. ఔట్ అయ్యాడు.. రిపీట్.. దేవుడే కాపాడాలి

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jan 23 , 2025 | 07:19 PM