Hardik-Gill: హార్దిక్‌తో గొడవపై తేల్చేసిన గిల్.. ఒక్క పోస్ట్‌తో..!
ABN , Publish Date - May 31 , 2025 | 06:36 PM
హార్దిక్ పాండ్యాతో గొడవపై క్లారిటీ ఇచ్చాడు శుబ్‌మన్ గిల్. సోషల్ మీడియా వేదికగా పెట్టిన పోస్ట్‌తో విమర్శకులకు ఇచ్చిపడేశాడు. మరి.. గిల్ పోస్ట్‌లో ఏందో ఉందో ఇప్పుడు చూద్దాం..

ఐపీఎల్‌లో ఆటగాళ్ల ప్రదర్శనతో పాటు గ్రౌండ్‌లో జరిగే ఇతరత్రా విషయాలు కూడా వైరల్ అవుతుంటాయి. ప్లేయర్లు ఒకరితో మరొకరు వ్యవహరించే తీరును అంతా గమనిస్తూ ఉంటారు. అయితే ఆటగాళ్లంతా ఒకరితో ఒకరు బాగానే ఉన్నా ఒక్కోసారి అనుకోకుండా వివాదాల బారిన పడతారు. మైదానంలో జరిగే విషయాలకు సంబంధించి బయటకు వచ్చే కొన్ని ఫొటోలు, వీడియోలు సరికొత్త వివాదాలకు దారితీస్తుంటాయి. ఐపీఎల్-2025లో భాగంగా ముంబై ఇండియన్స్-గుజరాత్ టైటాన్స్‌కు మధ్య జరిగిన మ్యాచ్‌లో ఇలాంటి ఓ అనూహ్య ఘటనే చోటుచేసుకుంది. దీంతో ఎంఐ సారథి హార్దిక్ పాండ్యా, జీటీ కెప్టెన్ శుబ్‌మన్ గిల్ మధ్య విభేదాలు ఉన్నాయంటూ రూమర్స్ పుట్టుకొచ్చాయి. దీనిపై తాజాగా శుబ్‌మన్ స్పందించాడు. ఇంతకీ అతడేం అన్నాడంటే..
ఫ్యాన్స్‌కు రిక్వెస్ట్..
హార్దిక్‌కు తనకు మధ్య ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేశాడు గిల్. తమ మధ్య మంచి అనుబంధం, ప్రేమ మాత్రమే ఉన్నాయని శుబ్‌మన్ చెప్పుకొచ్చాడు. ఇంటర్నెట్‌లో చూసే ప్రతి విషయాన్ని నమ్మొద్దని అభిమానుల్ని కోరాడు జీటీ సారథి. నిన్న ఎంఐ-జీటీ మ్యాచ్ టాస్ టైమ్‌లో గిల్-హార్దిక్ షేక్ హ్యాండ్స్ ఇచ్చుకోలేదు. సాధారణంగా టాస్ సమయంలో ఇరు జట్ల సారథులు కరచాలనం చేసుకోవడం ఆనవాయితీ. అయితే పాండ్యా షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు ప్రయత్నించగా.. గిల్ పట్టించుకోకుండా వెళ్లిపోయాడు. ఆ తర్వాత శుబ్‌మన్ బ్యాటింగ్ చేస్తుండగా హార్దిక్ గట్టిగా అరుస్తూ కనిపించాడు. దీంతో వీళ్లిద్దరికీ పడట్లేదని, గట్టిగానే గొడవ నడుస్తోందని పుకార్లు వినిపించాయి. దీనిపై తాజాగా స్పందించిన గిల్.. తమ మధ్య ఎలాంటి గొడవలు లేవని క్లారిటీ ఇచ్చాడు. అవాస్తవాలను నమ్మొద్దని ఫ్యాన్స్‌ను కోరాడు. మరి.. ఇప్పటికైనా ఈ వివాదానికి ఫుల్‌స్టాప్ పడుతుందేమో చూడాలి.
ఇవీ చదవండి:
తిట్టిన నోళ్లే పొగుడుతున్నాయి!
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి