Shubman Gill: చరిత్ర సృష్టించిన గిల్.. తోపుల వల్ల కానిది సాధించాడు
ABN , Publish Date - Feb 12 , 2025 | 03:03 PM
IND vs ENG: టీమిండియా వైస్ కెప్టెన్ శుబ్‌మన్ గిల్ నయా హిస్టరీ క్రియేట్ చేశాడు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లాంటి తోపులకు సాధ్యం కాని ఓ అరుదైన ఘనత సాధించాడు.

భారత వైస్ కెప్టెన్ శుబ్‌మన్ గిల్ చరిత్ర సృష్టించాడు. తోపులకే సాధ్యం కాని ఓ అరుదైన ఘనతను అతడు అందుకున్నాడు. ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఆఖరి వన్డేలో గిల్ ఓ రేర్ ఫీట్ నమోదు చేశాడు. వన్డే క్రికెట్‌లో అత్యంత వేగంగా 2500 పరుగుల మైలురాయిని అందుకున్న క్రికెటర్‌గా గిల్ రికార్డు క్రియేట్ చేశాడు. 50 ఇన్నింగ్స్‌ల్లో అతడు ఈ మైల్‌స్టోన్‌ను అందుకున్నాడు. వన్డేల్లో అత్యంత వేగంగా 2500 పరుగులు బాదిన బ్యాటర్ల జాబితాలో ఇంతకుముందు వరకు సౌతాఫ్రికా లెజెండ్ హషీమ్ ఆమ్లా టాప్‌లో ఉండేవాడు. ఇప్పుడు అతడ్ని దాటేశాడు టీమిండియా ఓపెనర్.
బిగ్ టార్గెట్ పక్కా!
అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరుగుతున్న ఆఖరి వన్డేలో భారత్ తొలుత బ్యాటింగ్‌కు దిగింది. ప్రస్తుతం 17 ఓవర్లలో 1 వికెట్ నష్టానికి 105 పరుగులతో ఉంది. శుబ్‌మన్ గిల్ (53 నాటౌట్), విరాట్ కోహ్లీ (49 నాటౌట్) క్రీజులో ఉన్నారు. గిల్ వరుసగా మూడో హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. చాన్నాళ్లుగా బ్యాడ్ ఫామ్‌తో ఇబ్బంది పడుతున్న విరాట్ మంచి స్టార్ట్‌ను భారీ ఇన్నింగ్స్‌గా మలిచేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఇద్దరూ బౌండరీల మోత మోగిస్తున్నారు. ఒకవేళ చివరి వరకు బ్యాటింగ్ చేస్తే స్కోరు అలవోకగా 330 పరుగుల వరకు చేరుకోవచ్చు. గిల్, కోహ్లీలో ఒకరు ఆఖరు వరకు ఆడితే మరింత బిగ్ టార్గెట్ సెట్ చేయొచ్చు. వీళ్లకు తోడు మిడిలార్డర్ బ్యాటర్లు కూడా రాణిస్తే జట్టుకు తిరుగుండదు.
ఇవీ చదవండి:
టీమిండియాకు బిగ్ షాక్.. ఎంత పనాయె బుమ్రా
సీనియర్ జట్టుకు వరల్డ్‌కప్ అందించాలి
యూఎస్ ఓపెన్ ‘మిక్స్‌డ్’లో మార్పులు
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి