Share News

Rohit Sharma: రోహిత్‌కు అవమానం.. జూనియర్ కెప్టెన్సీలో ఆడనున్న హిట్‌మ్యాన్

ABN , Publish Date - Jan 20 , 2025 | 06:34 PM

Rohit Sharma: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ రంజీల్లో ఆడేందుకు సిద్ధమవుతున్నాడు. గత కొన్ని రోజులుగా ప్రాక్టీస్‌లో మునిగిపోయిన హిట్‌మ్యాన్.. దేశవాళీ క్రికెట్‌లో తన బ్యాట్ పవర్ ఏంటో చూపించాలని అనుకుంటున్నాడు.

Rohit Sharma: రోహిత్‌కు అవమానం.. జూనియర్ కెప్టెన్సీలో ఆడనున్న హిట్‌మ్యాన్
Rohit Sharma

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ 10 ఏళ్ల తర్వాత తిరిగి రంజీ ట్రోఫీలోకి అడుగు పెడుతున్నాడు. జమ్మూ కశ్మీర్‌తో జనవరి 23న జరిగే మ్యాచ్‌లో అతడు ఆడనున్నాడు. అతడితో పాటు భారత స్టార్లు యశస్వి జైస్వాల్, శ్రేయస్ అయ్యర్, శివమ్ దూబె, శార్దూల్ ఠాకూర్ కూడా రంజీల్లో దుమ్మురేపనున్నారు. వీళ్లంతా ముంబై జట్టు తరఫున సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నారు. అయితే రంజీల్లో కమ్‌బ్యాక్ ఇస్తున్న వేళ హిట్‌మ్యాన్‌కు అవమానం జరిగింది. తన కంటే కెరీర్‌లో జూనియర్ ఆటగాడి సారథ్యంలో అతడు బరిలోకి దిగాల్సిన పరిస్థితి నెలకొంది. అసలేం జరిగిందో ఇప్పుడు చూద్దాం..


ఎందుకీ అవమానం!

జమ్మూ కశ్మీర్‌తో జరిగే మ్యాచ్‌లో రోహిత్ శర్మ కేవలం బ్యాటర్‌గా మాత్రమే బరిలోకి దిగనున్నాడు. 17 మంది సభ్యుల ఈ టీమ్‌కు సొగసరి బ్యాటర్ అజింక్యా రహానె సారథ్యం వహించనున్నాడు. హిట్‌మ్యాన్ కేవలం బ్యాటర్‌గానే ఆడనుండటం, రహానె కెప్టెన్సీ చేయనుండటం చర్చనీయాంశంగా మారింది. రోహిత్‌తో పోలిస్తే రహానె దాదాపు రెండేళ్లు జూనియర్. హిట్‌మ్యాన్ ఇంటర్నేషనల్ క్రికెట్‌లోకి డెబ్యూ ఇచ్చిన టైమ్‌లో రహానె డొమెస్టిక్ క్రికెట్‌లోకి అప్పుడప్పుడే వచ్చాడు. అలాంటప్పుడు జూనియర్ సారథ్యంలో రోహిత్ ఎందుకు ఆడుతున్నాడనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఇది అతడ్ని అవమానించినట్లేనని సోషల్ మీడియాలో నెటిజన్స్ అంటున్నారు.


రహానె కరెక్ట్!

నేషనల్ డ్యూటీ లేని సమయంలో టీమిండియా ఆటగాళ్లంతా దేశవాళీల్లో ఆడాల్సిందేనని భారత క్రికెట్ బోర్డు ఇటీవల నిబంధన తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. అందుకే 10 ఏళ్ల తర్వాత రోహిత్ కూడా రంజీ బరిలోకి దిగుతున్నాడు. ఇక మీదట కూడా టెస్టు, వన్డే మ్యాచులు లేనప్పుడు హిట్‌మ్యాన్ డొమెస్టిక్ క్రికెట్ ఆడటం ఖాయం. అలాంటప్పుడు అతడు ఆడే మ్యాచులకు ముంబై కెప్టెన్‌గా అతడ్నే నియమించాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఇంత అవమానం కరెక్ట్ కాదనే కామెంట్స్ వస్తున్నాయి. అయితే రహానె సారథ్యంలో ముంబై ఎన్నో అద్భుత విజయాలు సాధించిందని.. ప్రతి ఆటగాడి బలాబలాలు అజింక్యాకు తెలుసునని, ఎక్కువ మ్యాచులకు అందుబాటులో ఉంటాడు కాబట్టి అతడ్ని కెప్టెన్‌గా కంటిన్యూ చేయడం కరెక్టేననే అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. కెప్టెన్సీ చేయకపోయినా ఐపీఎల్‌లో మాదిరిగా ఎప్పటికప్పుడు సలహాలు, సూచనలు ఇస్తూ రోహిత్ టీమ్‌కు పెద్దదిక్కుగా ఉంటాడని ఎక్స్‌పర్ట్స్ అంటున్నారు.


ఇవీ చదవండి:

మనసులు గెలుచుకున్న రోహిత్.. నువ్వు గ్రేట్ బాస్

కెప్టెన్‌గా పంత్.. కప్పు కొట్టేలా ఉన్నారే

బుమ్రాకు సారీ చెప్పిన స్టార్ సింగర్

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jan 20 , 2025 | 06:40 PM