Share News

Rohit Sharma: ఆ కోపం ఇంకా పోలేదు.. రోహిత్ మాటలు వింటే గూస్‌బంప్స్!

ABN , Publish Date - Jun 26 , 2025 | 09:04 PM

టీమిండియా వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ ఆ జట్టును వదిలే ప్రసక్తే లేదంటున్నాడు. వాళ్ల మీద కోపం ఎప్పటికీ తగ్గదంటున్నాడు. హిట్‌మ్యాన్ ఇంకా ఏమన్నాడంటే..

Rohit Sharma: ఆ కోపం ఇంకా పోలేదు.. రోహిత్ మాటలు వింటే గూస్‌బంప్స్!
Rohit Sharma

వరల్డ్ టాప్ టీమ్స్‌లో ఒకటైన ఆస్ట్రేలియాతో భారత్‌కు చాన్నాళ్ల నుంచి వైరం ఉంది. ముఖ్యంగా ఐసీసీ టోర్నమెంట్స్‌లో కంగారూలతో టీమిండియాకు గట్టి శత్రుత్వమే ఉంది. ప్రపంచ కప్-2003 ఫైనల్స్, వన్డే ప్రపంచ కప్-2023 ఫైనల్స్.. ఇలా పలు కీలక పోరుల్లో మెన్ ఇన్ బ్లూను ఓడించి కప్పును ఎగరేసుకుపోయారు కంగారూలు. అందుకే ఆసీస్‌తో పోరు అంటే చాలు మన ఆటగాళ్లు రెట్టింపు కసితో ఆడతారు. వాళ్లను ఓడించి తీరాలని అనుకుంటారు. ఇదే విషయంపై స్పందించాడు భారత వన్డే సారథి రోహిత్ శర్మ. ఇంతకీ హిట్‌మ్యాన్ ఏమన్నాడంటే..


అప్పుడే అసలు మజా..

‘ఆస్ట్రేలియా మీద కోపం సహజంగానే ఉంటుంది. వన్డే వరల్డ్ కప్-2023 ట్రోఫీని వాళ్లు మనకు దూరం చేశారు. అందుకే మాకు లోలోపల చాలా కోపం ఉంది. నవంబర్ 19న మనకు కప్పు రాకుండా చేశారు కంగారూలు. ప్లేయర్లకే కాదు.. మొత్తం దేశానికి ఆసీస్ టీమ్ అంటే కోపం ఉంటుంది. అందుకే వాళ్లకో మంచి రిటర్న్ గిఫ్ట్ అవ్వాలని అనుకున్నా. ఇవన్నీ మైండ్‌లో నడుస్తూ ఉంటాయి. అయితే క్రీజులోకి అడుగుపెట్టాక ఇవేవీ పట్టించుకోను. టోర్నమెంట్ నుంచి ఆసీస్‌ను బయటకు పంపాలి లాంటి ఆలోచనలతో బ్యాటింగ్ చేయను. జట్టు విజయం గురించే ఆలోచిస్తుంటా. కానీ డ్రెస్సింగ్ రూమ్‌లో మాత్రం వీళ్లను బయటకు పంపాల్సిందే.. అప్పుడే అసలు మజా వస్తుంది’ అని మాట్లాడుకుంటామని రోహిత్ చెప్పుకొచ్చాడు.


నాకౌట్ పంచ్!

టీ20 వరల్డ్ కప్‌-2024లో భాగంగా సూపర్-8 పోరులో ఆసీస్‌తో తలపడింది భారత్. సెమీస్‌కు వెళ్లాలంటే తప్పక నెగ్గాల్సిన మ్యాచ్‌లో కంగారూలకు నాకౌట్ పంచ్ ఇచ్చింది టీమిండియా. ఈ ఫైట్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన రోహిత్ సేన.. 20 ఓవర్లలో 5 వికెట్లకు 205 పరుగుల భారీ స్కోరు చేసింది. ఆ తర్వాత ఛేదన మొదలుపెట్టిన ఆస్ట్రేలియా.. మొత్తం ఓవర్లు ఆడి 7 వికెట్లకు 181 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఆ టోర్నీలో ఫైనల్స్‌కు చేరుకున్న భారత్.. చివరి పోరులో సౌతాఫ్రికాను ఓడించి కప్పును సొంతం చేసుకుంది. ఆసీస్‌తో మ్యాచ్‌లో 41 బంతుల్లో 92 పరుగులు చేసిన సారథి రోహిత్.. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. ఆ మ్యాచ్‌‌లో కసితో బ్యాటింగ్ చేశానని.. కంగారూలపై కోపం ఎప్పటికీ తగ్గదని, వాళ్లు మనకు పలు ట్రోఫీలు దూరం చేశారని తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు హిట్‌మ్యాన్.


ఇవీ చదవండి:

ప్లీజ్.. ఆ పని మాత్రం చేయకు

అనుకున్నంత పని చేశారుగా

బుమ్రా గాలి తీసిన సంజన

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 26 , 2025 | 09:23 PM