Share News

Rishabh Pant: ప్లీజ్.. ఆ పని మాత్రం చేయకు.. పంత్‌కు అశ్విన్ రిక్వెస్ట్!

ABN , Publish Date - Jun 26 , 2025 | 08:22 PM

పించ్ హిట్టర్ రిషబ్ పంత్‌ను చూసి భయపడుతున్నాడు వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్. ప్లీజ్.. అలా చేయడం ఆపేయాలని అతడ్ని కోరుతున్నాడు.

Rishabh Pant: ప్లీజ్.. ఆ పని మాత్రం చేయకు.. పంత్‌కు అశ్విన్ రిక్వెస్ట్!
Rishabh Pant

టీమిండియా నయా వైస్ కెప్టెన్ రిషబ్ పంత్ ఇప్పుడు ఫుల్ జోరు మీదున్నాడు. రీఎంట్రీలో అదరగొడుతున్న పంత్.. ఇంగ్లండ్ సిరీస్‌లోనూ ఓ రేంజ్‌లో ఆడుతున్నాడు. లీడ్స్ వేదికగా జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్‌లో ఏకంగా 2 సెంచరీలు బాదాడు పంత్. రెండు ఇన్నింగ్స్‌ల్లో చెరో శతకంతో ఇంగ్లండ్ జట్టును వణికించాడు. చిత్ర విచిత్రమైన షాట్లు, అటాకింగ్ బ్యాటింగ్‌తో ప్రత్యర్థి బౌలర్లకు దడ పుట్టించాడు. మ్యాచ్ పోయినా పంత్ పెర్ఫార్మెన్స్ మాత్రం అందర్నీ ఆకట్టుకుంది. అతడు ఇదే జోరును కొనసాగించాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఈ తరుణంలో వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. దయచేసి అలా చేయొద్దంటూ పంత్‌ను ఓ కోరిక కోరాడు అశ్విన్. అదేంటో ఇప్పుడు చూద్దాం..

rishabh pant


ఇదేం ఐపీఎల్ కాదు..

‘లీడ్స్ టెస్ట్‌లో భారత బ్యాటర్లు అదరగొట్టారు. అయితే వాళ్లు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. పరుగులు సాధించడం ఎంత ముఖ్యమో క్రీజులో ఎక్కువ సేపు గడపడం కూడా అంతే అవసరమని అర్థం చేసుకోవాలి. మన బ్యాటర్లు అధిక సమయం బ్యాటింగ్ చేసి ఇంగ్లండ్ టీమ్ ఫీల్డింగ్, బౌలింగ్‌లో అలసిపోయేలా చేయాలి. తొలి టెస్ట్‌లో మన టాప్-మిడిలార్డర్ బ్యాటర్లు బాగా ఆడారు. ముఖ్యంగా రిషబ్ పంత్ ఆట నన్ను ఆకట్టుకుంది. బాల్ లైన్, లెంగ్త్‌ను పర్ఫెక్ట్‌గా అంచనా వేసి అతడు కొట్టే షాట్లు సూపర్బ్‌గా ఉన్నాయి. అయితే అతడు ఆ ఫ్రంట్ ఫ్లిప్ చేయడం మాత్రం ఆపాలని కోరుతున్నా. ఐపీఎల్‌లో ఎక్కువగా అలసిపోం కాబట్టి అక్కడ అలాంటి సెలబ్రేషన్స్ చేయొచ్చు. కానీ టెస్ట్ క్రికెట్ చాలా భిన్నమైనది. ఇక్కడ ఇలాంటి ఫ్లిప్‌లు కొట్టడం అంత సురక్షితం కాదు’ అని అశ్విన్ సూచించాడు. ఫ్రంట్ ఫ్లిప్స్ ఆపేయాలని పంత్‌ను రిక్వెస్ట్ చేశాడు దిగ్గజ స్పిన్నర్.


ఇవీ చదవండి:

అనుకున్నంత పని చేసిన ఇంగ్లండ్

బుమ్రా గాలి తీసిన సంజన

మాట తప్పిన గిల్-గంభీర్

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 26 , 2025 | 08:24 PM