Share News

England Squad: ఇంగ్లండ్ టీమ్‌లోకి పేస్ పిచ్చోడు.. అనుకున్నంత పని చేశారుగా!

ABN , Publish Date - Jun 26 , 2025 | 07:56 PM

ఎడ్జ్‌బాస్టన్ టెస్ట్ కోసం సిద్ధమవుతున్న స్టోక్స్ సేన.. ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగే తమ టీమ్‌పై కీలక ప్రకటన చేసింది. స్క్వాడ్‌లోకి ప్రమాదకర బౌలర్‌ను తీసుకుంది ఇంగ్లండ్.

England Squad: ఇంగ్లండ్ టీమ్‌లోకి పేస్ పిచ్చోడు.. అనుకున్నంత పని చేశారుగా!
IND vs ENG

టీమిండియాతో సిరీస్‌ను విజయవంతంగా ప్రారంభించింది ఇంగ్లండ్. లీడ్స్ వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో విక్టరీ కొట్టింది స్టోక్స్ సేన. మ్యాచ్ ఆసాంతం పోటాపోటీగా సాగినా చివరి రోజు బ్యాటింగ్‌లో అదరగొట్టిన ఆతిథ్య జట్టు భారత్‌ను ఓడించి గెలుపు తీరాలను చేరుకుంది. 5 టెస్టుల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో ఉన్న ఇంగ్లీష్ టీమ్.. ఇదే జోరును ఎడ్జ్‌బాస్టన్‌లోనూ కొనసాగించాలని చూస్తోంది. అక్కడా గెలిచి 2-0తో తిరుగులేని ఆధిపత్యాన్ని చలాయించాలని చూస్తోంది. ఈ నేపథ్యంలోనే జట్టులోకి ఓ పేస్ పిచ్చోడ్ని కూడా తీసుకుంది. అతడు గానీ చెలరేగితే భారత్‌కు కష్టాలు తప్పేలా లేవు. మరి.. ఆ బౌలర్ ఎవరనేది ఇప్పుడు చూద్దాం..

archer.jpg


ఇక దబిడిదిబిడే..

ఎడ్జ్‌బాస్టన్ టెస్ట్ జులై 2వ తేదీన మొదలుకానుంది. ఆ మ్యాచ్‌కు ఇంకా 6 రోజుల సమయం ఉంది. కానీ ఈ పోరు కోసం 15 మందితో కూడిన స్క్వాడ్‌ను తాజాగా ప్రకటించింది ఇంగ్లండ్. స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్‌ను కొత్తగా టీమ్‌లోకి తీసుకుంది ఆతిథ్య జట్టు. లీడ్స్ టెస్ట్‌లో ఆడిన కెప్టెన్ బెన్‌స్టోక్స్, జో రూట్, బెన్ డకెట్, షోయబ్ బషీర్, హ్యారీ బ్రూక్, జాక్ క్రాలే, ఓలీ పోప్, జేమీ స్మిత్, బ్రైడన్ కార్స్, జోష్ టంగ్, క్రిస్ వోక్స్ స్క్వాడ్‌లో ఉన్నారు. వీళ్లతో పాటు బేతెల్, సామ్ కుక్, జేమీ ఓవర్టన్ కూడా జట్టులో ఉన్నారు. అయితే వీళ్లలో ఎవరెవర్ని ప్లేయింగ్ ఎలెవన్‌లోకి తీసుకుంటారో చూడాలి. ముఖ్యంగా చాన్నాళ్ల తర్వాత కమ్‌బ్యాక్ ఇస్తున్న ఆర్చర్‌ను బరిలోకి దించుతారా? అనేది ఆసక్తిని రేకెత్తిస్తోంది. మొత్తానికి అతడ్ని తీసుకుంటారో లేదో అనుకుంటే స్క్వాడ్‌లో పేరు చేర్చి భారత శిబిరాన్ని భయపెట్టిస్తోంది ఇంగ్లండ్. దీంతో ఆతిథ్య జట్టు అనుకున్నంత పని చేసిందిగా అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.


ఇవీ చదవండి:

సచిన్ చెప్పిన మాటతో..!

బుమ్రా గాలి తీసిన సంజన

మాట తప్పిన గిల్-గంభీర్

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 26 , 2025 | 07:56 PM