Suryakumar Yadav: ఆస్పత్రి బెడ్‌పై సూర్యకుమార్.. అసలు భారత కెప్టెన్‌కు ఏమైంది?
ABN , Publish Date - Jun 26 , 2025 | 02:24 PM
భారత టీ20 జట్టు సారథి సూర్యకుమార్ యాదవ్ ఆస్పత్రి బెడ్‌పై ఉన్న విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో స్కైకి ఏమైంది అంటూ టెన్షన్ పడుతున్నారు అభిమానులు.

భారత టీ20 టీమ్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ బయట పెద్దగా కనిపించడం లేదు. ప్రైవేట్ కార్యక్రమాలకు కూడా హాజరవ్వడం లేదు. ఐపీఎల్-2025 ముగిసినప్పటి నుంచి సూర్యకుమార్ సోషల్ మీడియాలోనూ అంతగా సందడి చేయడం లేదు. దీంతో సూర్య ఏం చేస్తున్నాడోననే సందేహం అభిమానుల్లో నెలకొంది. ఈ తరుణంలో ఆస్పత్రి బెడ్ మీద స్కై ఉన్న ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. దీంతో సూర్య భాయ్‌కు ఏమైంది? అతడు హాస్పిటల్‌కు ఎందుకు వెళ్లాడు? అంతా ఓకేనా.. ఏదైనా ప్రమాదమా? అనే ప్రశ్నలు ఫ్యాన్స్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. అసలేం జరిగింది.. సూర్య ఆస్పత్రికి ఎందుకు వెళ్లాడు? అనేది ఇప్పుడు చూద్దాం..
మ్యాటర్ ఇదే..
పొత్తికడుపు నొప్పి లేదా గజ్జల్లో గాయం (స్పోర్ట్స్ హెర్నియా)తో బాధపడుతున్న సూర్యకుమార్ దానికి చికిత్స తీసుకున్నాడు. సతీమణి దేవిషా శెట్టితో కలసి జర్మనీలోని మ్యూనిచ్‌కు వెళ్లిన భారత కెప్టెన్.. గాయానికి అక్కడే ట్రీట్‌మెంట్ చేయించుకున్నాడు. సర్జరీ విజయవంతం అవడంతో ఇదే విషయాన్ని అభిమానులతో పంచుకున్నాడు. టెన్షన్ పడాల్సిందేమీ లేదంటూ ఓకే సింబల్ ఇస్తూ దిగిన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు స్కై. దీంతో ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకుంటున్నారు. ఆగస్టు 26న బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్ ఆడనుంది భారత్. ఆ సిరీస్‌కు ముందు 2 నెలల గ్యాప్ దొరకడంతో స్పోర్ట్స్ హెర్నియాకు ట్రీట్‌మెంట్ చేయించుకున్నాడు సూర్య. బంగ్లాతో సిరీస్ సమయానికి కోలుకొని ఫిట్‌నెస్ సాధించాలని చూస్తున్నాడు. అప్పటివరకు బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో పునరావాసంలో ఉంటాడు. ఫుల్‌గా రికవర్ అయ్యాకే టీమిండియాతో చేరతాడు.
ఇవీ చదవండి:
పంత్ 7 కెరీర్ అత్యుత్తమ ర్యాంక్
బుమ్రాకు విశ్రాంతి.. నిజమేనా..
బంగ్లాదేశ్ 220 పరుగులు 8 వికెట్లకు
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి