Rohit Sharma Record: సచిన్ క్రేజీ రికార్డుపై కన్నేసిన రోహిత్.. చరిత్రకు అడుగు దూరం
ABN , Publish Date - Feb 11 , 2025 | 10:40 AM
India vs England: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మరో క్రేజీ రికార్డుపై కన్నేశాడు. ఇంగ్లండ్‌తో ఆఖరి వన్డేలో అరుదైన ఘనత సాధించాలని అతడు ఉవ్విళ్లూరుతున్నాడు.

రోహిత్ శర్మ బ్యాట్ గర్జిస్తే ఎలా ఉంటుందో ఇంగ్లండ్‌తో జరిగిన రెండో వన్డేతో మరోసారి రుజువైంది. ఇన్నాళ్లూ ఫామ్‌లో లేక తీవ్రంగా ఇబ్బంది పడిన హిట్‌మ్యాన్.. ఇంగ్లీష్ టీమ్ మీద చెలరేగి ఆడాడు. ఫోర్లు, సిక్సులతో వాళ్లను ఊచకోత కోశాడు. ఏకంగా 7 సిక్సులతో చెడుగుడు ఆడుకున్నాడు. స్టన్నింగ్ సెంచరీతో హిట్‌మ్యాన్ ఈజ్ బ్యాక్ అని సింహనాదం చేశాడు. ఆ మ్యాచ్‌తో ఎన్నో పాత రికార్డులకు అతడు పాతర వేశాడు. ఇప్పుడు మరో క్రేజీ రికార్డుపై గురి పెడుతున్నాడు హిట్‌మ్యాన్. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్‌తో పాటు దిగ్గజ సారథి సౌరవ్ గంగూలీ రికార్డుపై కన్నేశాడు. మరి.. ఆ రికార్డు ఏంటనేది ఇప్పుడు చూద్దాం..
అరుదైన ఘనతకు అడుగు దూరం!
సుదీర్ఘ కెరీర్‌లో 266 వన్డేలు ఆడిన రోహిత్.. 10,868 పరుగులు చేశాడు. 11 వేల పరుగుల క్లబ్‌లో చేరేందుకు మరో 132 పరుగుల దూరంలో ఉన్నాడు. బారాబతి స్టేడియంలో సెంచరీ బాదిన భారత సారథి.. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా రేపు జరిగే ఆఖరి వన్డేలోనూ భారీ సెంచరీ బాదితే అరుదైన క్లబ్‌లో చేరిపోతాడు. భారత్ తరఫున వన్డేల్లో 11 వేల క్లబ్‌లో చేరిన బ్యాటర్ల జాబితా చూసుకుంటే.. సచిన్‌తో పాటు సౌరవ్ గంగూలీ, విరాట్ కోహ్లీ ఉన్నారు. 11 వేల మైలురాయిని అత్యంత వేగంగా అందుకున్న క్రికెటర్‌గా కోహ్లీ (10 సంవత్సరాల 302 రోజులు) ఉన్నాడు. వీళ్ల సరసన చేరేందుకు రోహిత్ ఉవ్విళ్లూరుతున్నాడు. ఇంగ్లండ్‌తో ఆఖరి మ్యాచ్‌తో ఈ క్లబ్‌లో జాయిన్ అవుతాడా? లేదా చాంపియన్స్ ట్రోఫీలో ఆ ఘనతను అందుకుంటాడా? అనేది చూడాలి.
ఇదీ చదవండి:
టీమిండియా స్టార్లకు డేంజర్.. గంభీర్ పిచ్చికి బలవడం ఖాయం
నేనేం చేయాలో నాకు తెలుసు.. వాళ్లకు ఇచ్చిపడేసిన రోహిత్
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి