Rohit Sharma: రోహిత్ వాళ్లతో జాగ్రత్త.. టీమిండియా మాజీ కోచ్ సజెషన్
ABN , Publish Date - Feb 11 , 2025 | 12:14 PM
Champions Trophy 2025: మరో వారం రోజుల్లో చాంపియన్స్ ట్రోఫీ సంరంభం మొదలవనుంది. దీంతో ఐసీసీ ట్రోఫీని ఎగరేసుకుపోవాలని అన్ని జట్లు భావిస్తున్నాయి. ఈ తరుణంలో భారత సారథి రోహిత్‌కు ఓ మాజీ కోచ్ ఒక సలహా ఇచ్చాడు. అదేంటో చూద్దాం..

టీమిండియా ఇప్పుడు ఇంగ్లండ్‌తో ఆడుతూ బిజీగా ఉంది. ఆ టీమ్‌తో టీ20 సిరీస్‌ను 4-1 తేడాతో గెలుచుకున్న భారత్.. ప్రస్తుతం జరుగుతున్న వన్డే సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంది. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్‌ను సొంతం చేసుకుంది. ఇదే ఊపులో త్వరలో ఆరంభం కానున్న చాంపియన్స్ ట్రోఫీలోనూ దుమ్మురేపాలని భావిస్తోంది. గతేడాది పొట్టి ప్రపంచ కప్ పట్టేశాం.. ఈసారి వన్డే వరల్డ్ కప్‌ను సొంతం చేసుకోవాలని రోహిత్ సేన పట్టుదలతో ఉంది. ఈ తరుణంలో హిట్‌మ్యాన్‌కు టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి కీలక సూచన చేశాడు. అదేంటో ఇప్పుడు చూద్దాం..
బీ కేర్‌ఫుల్!
చాంపియన్స్ ట్రోఫీలో భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, న్యూజిలాండ్‌తో పాటు బంగ్లాదేశ్, పాకిస్థాన్, ఆఫ్ఘానిస్థాన్ కూడా పాల్గొంటున్నాయి. టీమిండియా, ఆసీస్, ఇంగ్లండ్, కివీస్, ప్రొటీస్ ఫేవరెట్లుగా బరిలోకి దిగుతున్నాయి. అయితే రవిశాస్త్రి మాత్రం పాకిస్థాన్ టీమ్ చాలా డేంజరస్ అని అంటున్నాడు. ఆ జట్టుతో భారత్ జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నాడు. మెగా ట్రోఫీకి ఆతిథ్యం ఇస్తున్న దాయాదిని అస్సలు తక్కువ అంచనా వేయొద్దని హెచ్చరిస్తున్నాడు. రవిశాస్త్రి ఇంకా ఏం అన్నాడో ఇప్పుడు చూద్దాం..
మరింత డేంజర్!
‘గత ఆరేడు నెలలుగా పాకిస్థాన్ జట్టు వన్డేల్లో అద్భుతంగా ఆడుతూ వస్తోంది. సౌతాఫ్రికాలోనూ బాగా పెర్ఫార్మ్ చేసింది. గాయం కారణంగా ఓపెనర్ సయీమ్ అయూబ్ అందుబాటులో లేడు. అయినా సొంతగడ్డ మీద పాక్‌ను తక్కువ అంచనా వేయడానికి లేదు. అది కచ్చితంగా డేంజరస్ టీమే. అనుకూల పరిస్థితుల మధ్య ఆ జట్టు సెమీఫైనల్‌కు అలవోకగా చేరుకుంటుందని భావిస్తున్నా. అక్కడి నుంచి ఏం జరిగేది అంచనా వేయడం కష్టం. సెమీస్‌లో ఎవరైనా గెలవొచ్చు. అయితే నాకౌట్‌కు క్వాలిఫై అయితే మాత్రం పాక్ మరింత ప్రమాదకర జట్టుగా మారుతుంది’ అని రవిశాస్త్రి చెప్పుకొచ్చాడు. కాగా, మెగా టోర్నీలో భారత్ ఉన్న గ్రూప్‌లోనే పాక్ కూడా ఉంది. ఫిబ్రవరి 23వ తేదీన రోహిత్ సేన దాయాదితో తలపడనుంది.
ఇదీ చదవండి:
కివీస్ లెజెండ్ ఊచకోత.. 49 బంతుల్లో 160 రన్స్.. ఇదేం బాదుడు సామి
సచిన్ క్రేజీ రికార్డుపై కన్నేసిన రోహిత్.. చరిత్రకు అడుగు దూరం
టీమిండియా స్టార్లకు డేంజర్.. గంభీర్ పిచ్చికి బలవడం ఖాయం
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి