Share News

Bumrah vs Bishnoi: బుమ్రా పరువు తీసిన బిష్ణోయ్.. నవ్వకండి సీరియస్ మ్యాటర్

ABN , Publish Date - Apr 27 , 2025 | 08:48 PM

Today IPL Match: ముంబై ఇండియన్స్ వరుసగా ఐదో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. లక్నో సూపర్ జెయింట్స్‌తో వాంఖడేలో జరిగిన మ్యాచ్‌లో 54 పరుగుల భారీ తేడాతో నెగ్గి పాయింట్స్ టేబుల్‌లో 2వ స్థానానికి ఎగబాకింది హార్దిక్ సేన.

Bumrah vs Bishnoi: బుమ్రా పరువు తీసిన బిష్ణోయ్.. నవ్వకండి సీరియస్ మ్యాటర్
Jasprit Bumrah

ప్రస్తుత క్రికెట్‌లో టాప్ బౌలర్ ఎవరంటే.. దాదాపుగా అందరూ ముక్తకంఠంతో ఒకే పేరు చెబుతారు. అదే జస్‌ప్రీత్ బుమ్రా. ఈ టీమిండియా పేసుగుర్రం ఆ లెవల్‌లో వరల్డ్ క్రికెట్‌ను శాసిస్తున్నాడు. ఫార్మాట్లకు అతీతంగా బరిలోకి దిగిన ప్రతి మ్యాచ్‌లో అదరగొడుతున్నాడు. అతడి బౌలింగ్‌లో రన్స్ చేయడం దేవుడెరుగు.. వికెట్ కాపాడుకుంటే అదే చాలని తోపు బ్యాటర్లు కూడా భయపడుతుంటారు. అలాంటోడి పరువు తీశాడు టెయిలెండర్ రవి బిష్ణోయ్. అసలు వీళ్లిద్దరి మధ్య ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం..


ఒక్క షాట్‌తో..

ముంబై-లక్నో మ్యాచ్‌లో ఓ అనూహ్య ఘటన చోటుచేసుకుంది. ఎల్‌ఎస్‌జీ ఇన్నింగ్స్ సమయంలో రవి బిష్ణోయ్ ఓ భారీ సిక్స్ కొట్టాడు. అతడు ఆ సిక్స్ బాదింది బుమ్రా బౌలింగ్‌లో కావడం గమనార్హం. జస్‌ప్రీత్ వేసిన ఇన్నింగ్స్ 18వ ఓవర్‌లో లాంగాన్ మీదుగా భారీ సిక్సర్ కొట్టాడు బిష్ణోయ్. స్టార్ బ్యాటర్లు కూడా బుమ్రా బౌలింగ్‌కు భయపడితే.. బిష్ణోయ్ అలవోకగా సిక్సర్ బాదేశాడు. టెయిలెండర్ సిక్స్ కొట్టడంతో పరువు పోయినట్లు భావించిన బుమ్రా.. ఒకవైపు బాధపడుతూనే, మరోవైపు చిన్న స్మైల్ ఇచ్చాడు. అయితే సెంచరీ కొట్టినంత బిల్డప్ ఇచ్చిన బిష్ణోయ్.. ఎస్, ఎస్ అంటూ తెగ సెలబ్రేట్ చేసుకున్నాడు. పెవిలియన్‌లో కూర్చున్న పంత్ ఇది చూసి ఏంట్రా బాబు అంటూ నవ్వుల్లో మునిగిపోయాడు. కాగా, ఈ మ్యాచ్‌లో 54 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది ముంబై. ఈ గెలుపుతో పాయింట్స్ టేబుల్‌లో సెకండ్ పొజిషన్‌కు దూసుకెళ్లింది.


ఇవీ చదవండి:

రాక్షసుడు వచ్చేస్తున్నాడు

రికల్టన్ ఊచకోత.. తాటతీశాడు

ఈ పగ ఎప్పటికీ చల్లారదు

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Apr 27 , 2025 | 08:52 PM