Share News

Legend 90 League 2025: క్రికెట్‌లో కొత్త ఫార్మాట్.. 90 బంతుల్లో ఖేల్ ఖతం.. టీ20లను మించేలా..

ABN , Publish Date - Feb 07 , 2025 | 01:18 PM

Delhi Royals vs Chhattisgarh Warriors: క్రికెట్‌లో మరో కొత్త ఫార్మాట్ వచ్చేసింది. ఇకపై 90 బంతుల్లోనే మ్యాచులు ముగిసిపోవడాన్ని చూడొచ్చు. ఈ ఫార్మాట్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

Legend 90 League 2025: క్రికెట్‌లో కొత్త ఫార్మాట్.. 90 బంతుల్లో ఖేల్ ఖతం.. టీ20లను మించేలా..
Legend 90 League 2025

క్రికెట్ ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవుతూ వస్తోంది. ట్రెండ్‌కు తగ్గట్లు జెంటిల్మన్ గేమ్‌లో ఎన్నో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. వీటి వల్ల మరింత మంది ప్రేక్షకులకు గేమ్ దగ్గరవుతోంది. ఒకప్పుడు క్రికెట్‌లో టెస్టులే ఉండేవి. ఆ తర్వాత ఆటలో వేగం పెంచడం, ఆడియెన్స్‌ను మరింత ఎంటర్‌టైన్ చేయాలనే ఉద్దేశంతో వన్డే ఫార్మాట్‌ ప్రవేశపెట్టారు. అది సక్సెస్ అయిన కొన్నేళ్ల తర్వాత టీ20 ఎంట్రీ ఇచ్చింది. ఇప్పుడు హవా మొత్తం ఈ ఫార్మాట్‌దే. ప్రపంచ వ్యాప్తంగా పుట్టగొడుగుల్లా ఎన్నో క్రికెట్ లీగ్‌లు పుట్టుకొచ్చాయి. ఈ తరుణంలో జెంటిల్మన్ గేమ్‌లోకి మరో కొత్త ఫార్మాట్ ఎంట్రీ ఇచ్చింది. దాని గురించి ఇప్పుడు చూద్దాం..


ఎంత మంది బౌలింగ్ చేయొచ్చు?

ఇంటర్నేషనల్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన దిగ్గజ ఆటగాళ్లతో లెజెండ్ 90 లీగ్ 2025 స్టార్ట్ అయింది. ఈ లీగ్‌లో ప్రతి ఇన్నింగ్స్‌లో 15 ఓవర్లే ఉంటాయి. ఇన్నింగ్స్‌కు 90 బంతుల చొప్పున ఆడిస్తారు. 5 మంది బౌలర్లు గరిష్టంగా మూడేసి ఓవర్ల చొప్పున బౌలింగ్ చేయొచ్చు. జట్టులో నుంచి ఒక బౌలర్ మాత్రం గరిష్టంగా 4 ఓవర్లు వేయొచ్చు. ఇన్నింగ్స్‌లోని తొలి 4 ఓవర్లను బౌలింగ్ పవర్‌ప్లేగా పరిగణిస్తారు. ఈ సమయంలో కేవలం ఇద్దరు ఫీల్డర్లు మాత్రమే సర్కిల్ అవతల ఉండాలి.


పవర్‌ప్లే రూల్స్!

11 నుంచి 15 ఓవర్ల మధ్య ఒక ఓవర్‌ను బ్యాటింగ్ పవర్‌ప్లేగా పరిగణిస్తారు. ఈ టైమ్‌లో సర్కిల్ అవతల ముగ్గురు ఫీలర్డను మోహరించొచ్చు. ప్రస్తుతం జరుగుతున్న లెజెండ్స్ 90 లీగ్‌లో మొత్తం 7 జట్లు పాల్గొంటున్నాయి. ఇందులో నుంచి టాప్-2లో నిలిచిన జట్ల మధ్య ఫిబ్రవరి 17న ఫైనల్ మ్యాచ్ నిర్వహిస్తారు. ప్రయోగాత్మకంగా చేపట్టిన ఈ ఫార్మాట్ గనుక సక్సెస్ అయితే ఇంటర్నేషనల్ క్రికెట్‌లో దీన్ని ప్రవేశపెట్టే అవకాశాలను కొట్టిపారేయలేం. మరి.. ఈ 90 బంతుల ఆట సక్సెస్ అవుతుందో లేదో చూడాలి.


ఇవీ చదవండి:

ఫైనల్ చేరిన సన్‌రైజర్స్.. కావ్యా పాప టీమ్ అంటే మినిమం ఉండాలి

‘ద హండ్రెడ్‌’ జట్టును కొన్న ‘సన్‌రైజర్స్‌’

‘సన్‌రైజర్స్‌’బ్యాడ్మింటన్‌లో కొత్త స్కోరింగ్‌ విధానం

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Feb 07 , 2025 | 01:21 PM