Share News

IPL 2025 Playoffs: ఐపీఎల్‌కు బిగ్ షాక్‌.. ప్లేఆఫ్స్‌కు 3 దేశాల స్టార్లు దూరం

ABN , Publish Date - May 14 , 2025 | 08:35 AM

IPL 2025 Restart: ఐపీఎల్‌-2025 రీస్టార్ట్ కోసం ఏర్పాట్లు చేస్తున్న భారత క్రికెట్ బోర్డుకు వరుస షాకులు తగులుతున్నాయి. ముఖ్యంగా ఓవర్సీస్ ఆటగాళ్ల విషయంలో బోర్డు తలనొప్పి తగ్గడం లేదు. ఏకంగా 3 దేశాల స్టార్లు మిగిలిన సీజన్‌లో పాల్గొనడం లేదని తెలుస్తోంది. దీని గురించి మరింతగా చూద్దాం..

IPL 2025 Playoffs: ఐపీఎల్‌కు బిగ్ షాక్‌.. ప్లేఆఫ్స్‌కు 3 దేశాల స్టార్లు దూరం
IPL 2025

క్యాష్ రిచ్‌ లీగ్‌-2025 సీజన్‌ను మళ్లీ మొదలుపెడతామని చూస్తున్న భారత క్రికెట్ బోర్డుకు ఓవర్సీస్ ఆటగాళ్ల అంశం పెద్ద తలనొప్పిగా మారింది. భారత్-పాకిస్థాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా విదేశీ ఆటగాళ్లు ఇళ్లకు వెళ్లిపోయారు. అయితే ఉద్రిక్త పరిస్థితులు తగ్గుముఖం పట్టడం, అంతా సాధారణ స్థాయికి చేరుకుంటుండటంతో ఐపీఎల్‌లోని మిగిలిన మ్యాచులను పూర్తి చేయాలని బీసీసీఐ భావిస్తోంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం అనుమతితో మిగిలిన మ్యాచులకు సంబంధించిన షెడ్యూల్‌ను కూడా ప్రకటించింది. కానీ 3 దేశాల స్టార్లు మాత్రం ఆడటం అనుమానంగా మారింది. ఏయే దేశాల ప్లేయర్లు రావట్లేదో ఇప్పుడు చూద్దాం..


భారీ ఎదురుదెబ్బ..

ఆస్ట్రేలియా, సౌతాఫ్రికాతో పాటు ఇంగ్లండ్‌కు చెందిన పలువురు స్టార్లు మిగిలిన ఐపీఎల్‌లో పాల్గొనడం కష్టంగా కనిపిస్తోంది. వచ్చే నెలలో ప్రతిష్టాత్మక వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్ జరగనుంది. కప్ ఫైట్ కావడంతో ఈ మ్యాచ్ కోసం ఇప్పటి నుంచే సన్నాహాల్లో మునిగిపోనున్నాయి ఆసీస్-ప్రొటీస్. దీంతో కమిన్స్, హేజల్‌వుడ్, ట్రావిస్ హెడ్ లాంటి కంగారూ ప్లేయర్లతో పాటు కార్బిన్ బాష్, వియాన్ ముల్డర్, మార్కో జాన్సన్, మార్క్రమ్, లుంగి ఎంగిడి, రబాడ, రికల్టన్, స్టబ్స్ వంటి సౌతాఫ్రికా స్టార్లు ఐపీఎల్‌లోని మిగిలిన మ్యాచుల్లో పాల్గొనడటం సందేహాస్పదంగా మారింది. ఒకవేళ ప్రొటీస్ ప్లేయర్లు భారత్‌కు వచ్చినా.. సరిగ్గా ప్లేఆఫ్స్‌కు ముందు మే 25న స్వదేశానికి పయనమవుతారని వినిపిస్తోంది.


ఇంగ్లీష్ స్టార్లూ దూరం..

ఇంగ్లండ్ నుంచి కూడా కొందరు ఆటగాళ్లు ఐపీఎల్‌ను మిస్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. వెస్టిండీస్‌తో ఆ జట్టు ఆడే వన్డే సిరీస్ మే 29న మొదలవనుంది. ఆర్చర్, బేతెల్, బట్లర్, ఓవర్టన్ ఈ సిరీస్‌కు ఎంపికయ్యారు. కాబట్టి వీళ్లంతా ప్లేఆఫ్స్‌కు దూరమవడం ఖాయమనే చెప్పాలి. 3 దేశాల స్టార్లు మిస్ అయితే ప్లేఆఫ్స్ కళ కోల్పోయే ప్రమాదం ఉంది. ఈ సమస్యను అధిగమించడానికి బీసీసీఐ ఏదైనా మ్యాజిక్ చేస్తుందేమో చూడాలి.


ఇవీ చదవండి:

ఆ శిక్షణతో మరింత ఎత్తుకు

ఆధ్యాత్మిక పర్యటనలో విరుష్క

వచ్చే వరల్డ్‌కప్‌లో రోకోను చూడలేం

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - May 14 , 2025 | 08:41 AM