• Home » Australia Cricketers

Australia Cricketers

ఆసీస్‌తో ఏకైక టెస్టు: తొలి రోజు ముగిసిన ఆట.. 102 పరుగుల ఆధిక్యంలో భారత్

ఆసీస్‌తో ఏకైక టెస్టు: తొలి రోజు ముగిసిన ఆట.. 102 పరుగుల ఆధిక్యంలో భారత్

పెర్త్ వేదికగా పింక్ బాల్ టెస్టులో భారత్-ఆస్ట్రేలియా మహిళా జట్లు తలపడుతున్నాయి. టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన భారత మహిళలు 198 పరుగులకు ఆలౌటయ్యారు. కాగా ఛేదనకు దిగిన ఆసీస్.. తొలి రోజు ఆట ముగిసే సరికి 3 వికెట్లు కోల్పోయి 96 పరుగులు చేసింది.

క్రికెట్‌కు వీడ్కోలు.. ఆఖరి మ్యాచ్‌లో దంచికొట్టిన అలీసా హీలీ

క్రికెట్‌కు వీడ్కోలు.. ఆఖరి మ్యాచ్‌లో దంచికొట్టిన అలీసా హీలీ

ఆస్ట్రేలియా మహిళా జట్టు కెప్టెన్ అలీసా హీలీ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. భారత్‌తో ఆసీస్ మూడు వన్డేల సిరీస్ ఆడుతోంది. అందులో భాగంగా నేడు ఆఖరి మ్యాచ్ జరుగుతోంది. ఇందులో హీలీ అద్భుత సెంచరీతో అదరగొట్టింది.

మూడు వన్డేల సిరీస్: రెండో మ్యాచ్‌లోనూ భారత్ ఓటమి.. సిరీస్ ఆసీస్‌దే

మూడు వన్డేల సిరీస్: రెండో మ్యాచ్‌లోనూ భారత్ ఓటమి.. సిరీస్ ఆసీస్‌దే

మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా హోబర్ట్ వేదికగా భారత్-ఆస్ట్రేలియా మహిళా జట్లు రెండో మ్యాచ్‌లో తలపడ్డాయి. ఈ పోరులో ఆసీస్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలి వన్డేలోనూ గెలుపొందడంతో మరో మ్యాచ్ ఉండగానే సిరీస్‌ను 2-0తో దక్కించుకుంది.

భారత్‌తో మూడో టీ20: స్మృతి, జెమీమా హాఫ్ సెంచరీలు.. ఆసీస్ టార్గెట్ 177

భారత్‌తో మూడో టీ20: స్మృతి, జెమీమా హాఫ్ సెంచరీలు.. ఆసీస్ టార్గెట్ 177

మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా భారత్-ఆస్ట్రేలియా జట్లు అడిలైడ్ వేదికగా ఆఖరి టీ20లో తలపడుతున్నాయి. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా మహిళలు.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 176 పరుగులు చేశారు. ఆతిథ్య ఆసీస్‌కు 177 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించారు.

టీ20 ప్రపంచ కప్: ఆస్ట్రేలియా కథ ముగిసినట్లేనా?

టీ20 ప్రపంచ కప్: ఆస్ట్రేలియా కథ ముగిసినట్లేనా?

టీ20 ప్రపంచ కప్ 2026లో ఆస్ట్రేలియా జట్టు తీవ్రంగా విఫలమైంది. ఐదు సార్లు కప్‌ను ముద్దాడిన ఆసీస్.. ఈసారి గ్రూప్ స్టేజిలోనే నిష్క్రమించే పరిస్థితి ఏర్పడింది. ఇప్పటివరకు మూడు మ్యాచ్‌లు ఆడి కేవలం ఒకదాంట్లోనే విజయం సాధించింది.

Damian Martin: నాకు మద్దతుగా నిలిచిన అందరికీ కృతజ్ఞతలు.. ప్రాణాంతక వ్యాధి నుంచి కోలుకున్న ఆసీస్ స్టార్ ప్లేయర్

Damian Martin: నాకు మద్దతుగా నిలిచిన అందరికీ కృతజ్ఞతలు.. ప్రాణాంతక వ్యాధి నుంచి కోలుకున్న ఆసీస్ స్టార్ ప్లేయర్

ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ డామియన్ మార్టిన్.. మెనింజైటిస్ అనే ప్రాణాంతక వ్యాధి బారినపడిన విషయం తెలిసిందే. చికిత్స అనంతరం మార్టిన్ కోలుకుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యాడు. ఈ సందర్భంగా వైద్య సిబ్బందికి అతడు కృతజ్ఞతలు తెలిపాడు.

Alyssa Healy: షాకింగ్.. రిటైర్‌మెంట్ ప్రకటించిన ఆస్ట్రేలియా కెప్టెన్

Alyssa Healy: షాకింగ్.. రిటైర్‌మెంట్ ప్రకటించిన ఆస్ట్రేలియా కెప్టెన్

ఆస్ట్రేలియా మహిళల క్రికెట్‌కు షాక్ తగిలింది. ఆ జట్టు కెప్టెన్ అలీసా హీలీ అనూహ్యంగా అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికింది. రానున్న టీ20 ప్రపంచ కప్ ముంగిట హీలీ ఈ నిర్ణయం తీసుకోవడంతో అభిమానులతో పాటు క్రికెట్ మాజీలు కూడా ఆశ్చర్యపోతున్నారు.

Australian Cricketers: రోడ్డుపై కారును నెట్టిన ఆస్ట్రేలియా ఆటగాళ్లు.. ఎందుకంటే..

Australian Cricketers: రోడ్డుపై కారును నెట్టిన ఆస్ట్రేలియా ఆటగాళ్లు.. ఎందుకంటే..

ఆస్ట్రేలియా క్రికెటర్లు అస్టన్‌ అగర్‌, అరోన్‌ హర్డీ ప్రయాణిస్తున్న ఉబర్‌ కారు రోడ్డుపై ఆగిపోయింది. దీంతో వారు ఆ కారును తోసుకుంటూ స్టేడియానికి చేరుకున్నారు. బిగ్‌బాష్‌లీగ్‌లో (Big Bash League) భాగంగా పెర్త్ స్కార్చర్స్‌, సిడ్నీ థండర్స్‌ మధ్య మంగళవారం మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌కు ముందు వారు మైదానానికి చేరుకునే క్రమంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

 Don Bradman Auction: వేలానికి బ్రాడ్‌మన్ 'బ్యాగీ గ్రీన్' క్యాప్..

Don Bradman Auction: వేలానికి బ్రాడ్‌మన్ 'బ్యాగీ గ్రీన్' క్యాప్..

ఆస్ట్రేలియా క్రికెట్ లెజెండ్ డాన్ బ్రాడ్‌మన్ ధరించిన ప్రఖ్యాత ‘బ్యాగీ గ్రీన్’ క్యాప్ అభిమానుల కోసం వేలానికి అందుబాటులోకి వచ్చింది. బ్రాడ్‌మన్ తన కెరీర్‌లో చివరిసారిగా స్వదేశంలో టెస్టు సిరీస్‌లో పాల్గొన్న సమయంలో ధరించిన ఈ క్యాప్ వచ్చే ఏడాది జనవరి 26 వరకు వేలంలో ఉండనుంది.

Ashes 2025: ఇంగ్లాండ్‌ ఆలౌట్‌.. ఆస్ట్రేలియా టార్గెట్ ఎంతంటే?

Ashes 2025: ఇంగ్లాండ్‌ ఆలౌట్‌.. ఆస్ట్రేలియా టార్గెట్ ఎంతంటే?

యాషెస్‌ సిరీస్‌2025లో భాగంగా పెర్త్‌ వేదికగా జరుగుతున్న మొదటి టెస్ట్‌ మ్యాచ్‌ రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్‌.. 34.4 ఓవర్లలో 164 పరుగులకు ఆలౌటైంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి