Ashes 2025: ఇంగ్లాండ్ ఆలౌట్.. ఆస్ట్రేలియా టార్గెట్ ఎంతంటే?
ABN , Publish Date - Nov 22 , 2025 | 03:07 PM
యాషెస్ సిరీస్2025లో భాగంగా పెర్త్ వేదికగా జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్.. 34.4 ఓవర్లలో 164 పరుగులకు ఆలౌటైంది.
ఇండియా, పాకిస్థాన్ తరహాలో ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా మధ్య(Australia vs England Perth Test) యుద్ధాన్ని తలపించే ఓ సిరీస్ ఉందనే సంగతి అందరికి తెలిసిందే. దాని పేరే యాషెస్ సిరీస్. ఏటా జరిగే ఈ సిరీస్ ఈ ఏడాది కూడా ఘనంగా ప్రారంభమైంది. ప్రస్తుతం పెర్త్ వేదికగా మొదటి టెస్టు జరుగుతోంది. ఈ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్.. 34.4 ఓవర్లలో 164 పరుగులకు ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్‌లో దక్కిన 40 పరుగుల ఆధిక్యంతో కలిపి ఆసీస్‌కు 205 పరుగుల టార్గెట్ ను నిర్దేశించింది.
ఇంగ్లాండ్ బ్యాటర్లలో గస్ అట్కిస్సన్ (37) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఓలీ పోప్ 33, బెన్ డకెట్ 28, బ్రైడన్ కార్స్ 20 పరుగులు చేశారు. ఆస్ట్రేలియా బౌలర్లలో స్కాట్ బోల్యాండ్ 4 వికెట్లు తీశాడు. మిచెల్ స్టార్క్(Mitchell Starc), బ్రైడెన్ డొగ్గెట్ చెరో మూడు వికెట్లు తమ ఖాతాలో వేసుకున్నారు. ప్రస్తుతం ఆస్ట్రేలియా(Australia chase 205) గెలుపు దిశగా సాగుతోంది. కేవలం 1 వికెట్ మాత్రమే కోల్పోయి.. 176 పరుగుల వద్ద ఉంది. ఇక విజయానికి 29 పరుగులే కావాల్సి ఉంది.
అంతకు ముందు.. 123/9 ఓవర్‌నైట్ స్కోర్‌తో రెండో రోజు బ్యాటింగ్ ప్రారంభించిన ఆస్ట్రేలియా 45.2 ఓవర్లలో 132 పరుగులకు ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్ లో ఆసీస్ బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. అలెక్స్ క్యారీ (26) మాత్రమే టాప్ స్కోరర్. ట్రావిస్ హెడ్ 21, కామెరూన్ గ్రీన్ 24 పరుగులతో కాస్తా ఫర్వాలేదనిపించారు. జేక్ వెదర్లాండ్ (0), లబుషేన్ (9), స్టీవ్ స్మిత్ (17), ఉస్మాన్ ఖవాజా (2) విఫలమయ్యారు.
ఇంక ఇంగ్లాండ్ బౌలర్లలో బెన్‌స్టోక్స్ 5, బ్రైడన్ కార్స్ 3, జోఫ్రా ఆర్చర్ రెండు వికెట్లు తీసుకున్నారు. ఇంగ్లాండ్ తన తొలి ఇన్నింగ్స్‌లో 172 పరుగులు చేసిన విషయం తెలిసిందే. ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్ లో పటిష్ట స్థితిలో ఉంది. ఆసీస్ బ్యాటర్ల(Australia)ను ఔట చేసేందుకు ఇంగ్లీష్ బౌలర్లు బాగా కష్టపడుతున్నారు. ప్రస్తుత పరిస్థితి చూస్తే.. ఆస్ట్రేలియా విజయం దాదాపు ఖరారైంది. ఏదైనా అద్భుతం జరిగితే తప్పా.. తొలి టెస్టు ఫలితం మారుతుంది.
ఇవీ చదవండి:
స్మృతిని సర్‌ప్రైజ్ చేస్తూ పలాశ్ ప్రపోజ్.. వాహ్ అనాల్సిందే.!
ఆ స్థానంపై ప్రయోగాలెందుకు?: ఆకాశ్ చోప్రా