Gutkha bouquet gift: వామ్మో.. లవర్‌కు ఇలాంటి గిఫ్ట్ ఎవరైనా ఇస్తారా.. నెటిజన్లు ఏమంటున్నారంటే..
ABN , Publish Date - Nov 22 , 2025 | 03:04 PM
తాజాగా ఓ యువతి తన ప్రియుడికి ఇచ్చిన ఓ గిఫ్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాను కుదిపేస్తోంది. ఆమె తన ప్రియుడికి గట్కా ప్యాకెట్లతో తయారు చేసిన బొకేను ఇచ్చింది. ఈ వెరైటీ బహుమతిని చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.
ప్రేమికులు ఒకరికొకరు బహుమతులు ఇచ్చి పుచ్చుకోవడం అనేది సర్వ సాధారణం. పూలు, చాక్లెట్లు, పెర్ఫ్యూమ్‌లు, వాచ్‌లు, మొబైల్స్ మొదలైనవి సాధారణంగా బహుమతులుగా ఇస్తారు. అయితే తాజాగా ఓ యువతి తన ప్రియుడికి ఇచ్చిన ఓ గిఫ్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాను కుదిపేస్తోంది. ఆమె తన ప్రియుడికి గుట్కా ప్యాకెట్లతో తయారు చేసిన బొకేను ఇచ్చింది. ఈ వెరైటీ బహుమతిని చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు (viral gutkha bouquet video).
@the_kerala_girl అనే ఎక్స్ యూజర్ ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ యువతి తన బాయ్‌ఫ్రెండ్‌కు ఇవ్వడం కోసం ఓ బొకే తయారు చేయిస్తోంది. అయితే ఆ బొకేను గుట్కా ప్యాకెట్లతో తయారు చేస్తోంది. గుట్కా ప్యాకెట్లు అంటే ఆమె ప్రియుడికి చాలా ఇష్టమట. దాంతో ఆమె గుట్కా ప్యాకెట్లతో బొకే తయారు చేయాలని దుకాణదారుడిని అడిగింది. నీలరంగు కవర్లకు గుట్కా ప్యాకెట్లు అతికించి అతడు ఓ బొకేను తయారు చేశాడు. ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు (bouquet of death trend).
ఆ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది (gutkha gift). దాదాపు 60 వేల మంది ఆ వీడియోను వీక్షించారు. ఆ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందనలు తెలియజేస్తున్నారు. 'ఇది బహుమతి కాదు.. క్యాన్సర్' అని ఒకరు కామెంట్ చేశారు. అది డెత్ బొకే అని మరొకరు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ప్రియురాలు ఉంటే చావు తప్పదని మరొకరు కామెంట్ చేశారు.
ఇవి కూడా చదవండి..
రైలు రద్దీగా ఉంటే మాత్రం.. ఇలా ఎవరైనా చేస్తారా..
వాషింగ్‌మిషిన్ వాడేది దుస్తుల కోసమే అనుకుంటున్నారా..
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి